సింహాన్ని ఎదురించేందుకు జిత్తుల మారి నక్క అడవిలోని మిగతా జంతువులను పోగేసుకుంటుంది. అలాగే కులాల ప్రాతిపదికన ఒక్కో కులంలో ఒకరితో పొత్తులు, లోపాయికారి పొత్తుల ద్వారా ప్రజలను విడదీస్తూ వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా మార్చాలని పథకాలు రచిస్తున్నట్లుంది చంద్రబాబు.
పొత్తులు పెట్టుకుంటూ మిగతా పార్టీల జెండాల వెనక దాక్కోని యుద్ధం చేసే చంద్రబాబు 2024 ఎన్నికలకు కూడా అవే ఎత్తులు వేస్తున్నాడు.. ఒక్కో పార్టీలో ఒక్కో నాయకుడిని ఒక్కో కులానికి కేటాయిస్తూ ఎన్నికల బరిలో వైఎస్ జగన్ తో పోరాడేందుకు సిద్ధమవుతున్నాడు. కొత్తగా కాంగ్రెస్ తరుపున వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టి క్రిస్టియన్ రాగం వినిపిస్తుంటే.. కాపుల ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ ను ఎప్పుడో తన దొడ్లో కట్టేసాడు . రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ద్వారా కొందరు ముస్లిం పెద్దలను రంగం లోకి దింపి ముస్లిమ్స్ ను వైఎస్ జగన్ కు దూరం చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. ఇదంతా చాలదన్నట్టు బీజేపీతో పొత్తు కోసం బాబు ప్రాకులాడుతున్నాడంట.. ఒక్కో పార్టీకి 2024 ఎన్నికల నిధుల క్రింద వందల, వేల కోట్లు చంద్రబాబు వెచ్చిస్తున్నాడట.. అయితే వైఎస్ జగన్ మాత్రం ప్రతి సంక్షేమంలోనూ అన్ని కులాల వారికి సమన్యాయం చేస్తూ వారి మనసులను న్యాయంగా గెలుచుకున్నాడు.
14 ఏళ్ళు సీఎంగా చేసి కూడా ప్రజలకు ఏమి చేసాడో చెప్పుకోలేక.. ప్రజాక్షేత్రంలో జగన్ ను ఎదుర్కోలేక.. వేరే పార్టీలతో పొత్తులతో వస్తున్న చంద్రబాబు వైఎస్ జగన్ ను ఎదుర్కోని నిలవడం కల.. మంది మార్భలంతో చేసే చంద్రబాబు పోరాటం పైన బాధ్యతతో పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ నెగ్గడం తధ్యం..