వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది విషయంలో పారిశ్రామిక అభివృద్ధిలో ప్రత్యేక చొరవ తీసుకుంటూ కాకినాడలో ప్రత్యేక సెజ్ ఏర్పాటు చేసి పరిశ్రమలు వచ్చేలా చర్యలు తీసుకొన్నారు.ఇప్పుడు తాజాగా ప్రపంచ అగ్రశ్రేణి ఎరువుల సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు కాకినాడలో ఫాస్ఫారిక్ యాసిడ్, సాల్ఫురిక్ యాసిడ్ నిర్మించడానికి నిర్ణయం తీసుకొని కాకినాడలో తమకు జగన్ ప్రభుత్వం కేటాయించిన భూమిలో శంకుస్థాపన చేసి పూజలు నిర్వహించారు. ఈ ప్లాంట్ల నిర్మాణానికి దాదాపు 1000 కోట్లు పెట్టుబడి అవుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఫాస్ఫారిక్ యాసిడ్ తయారీ ప్లాంట్ 650 టన్నుల సమర్థ్యంతో నిర్మిస్తున్నారు, సాల్ఫురిక్ యాసిడ్ తయారీ ప్లాంట్ 1800 టన్నుల సమర్థ్యంతో నిర్మిస్తున్నారు, వీటిని కంపెనీ తమ ఇతర యురియా ప్రోడెక్ట్ ల తయారీలో ఉపాయోగించనున్నారు. ఈ యూనిట్ల నిర్మాణం వలన ముడి పదార్థాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడడం తగ్గుతుంది అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ శంకర్ మరియు రీజనల్ మేనేజర్ తో పాటు ఇతర కీలక అధికారులు , ఉద్యోగులు పాల్గొన్నారు.
కాకినాడ లో ఓక నెల క్రితమే 2400 కోట్ల పెట్టుబడితో పెన్సిలిన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను ప్రారంభించారు అరబిందో ఫార్మా కంపెనీ ప్రతినిధులు. తమ అనుబంధ సంస్థ ద్వారా కాకినాడ లో 2400 కోట్ల పెట్టుబడితో 15000 టన్నుల ఉత్పత్తి సమర్థ్యంతో ప్లాంట్ ను నిర్మించారు. ఇక్కడ దాదాపు 5000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించారు. ఈ ప్లాంటులో ఉత్పత్తి అయ్యే పెన్సిలిన్ లో 60% తమ కంపెనీ సొంత అవసరాలకు వినియోగించుకొని మిగిలిన 40% వాణిజ్య అవసరాలకు అనుగుణంగా దేశీయ అంతర్జాతీయ కంపెనీలకు విక్రయిస్తామని తెలిపారు. అంతే కాకుండా కాకినాడ పోర్టును వేల కోట్లతో అభివృద్ది చేస్తూ కాకినాడలో పారిశ్రామిక అభివృద్ధిలో కీలక అడుగులు వేస్తున్నది జగన్ ప్రభుత్వం.