తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నందమూరి తారక రామారావు కూతుళ్ళలో ఒకరైన నారా భువనేశ్వరికి సంభంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హెరిటేజ్ ఫూడ్స్ సంస్థ వైస్ చెర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ గా భాద్యతలు నిర్వహిస్తున్న భువనేశ్వరీ సదరు ఆడియోలో వాడిన భాష అత్యంత జుగుప్సాకరంగా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. .
సామాన్య మహిళలు , పిల్లలు వినలేని పదజాలంతో ఆమె ఎవరినో తీవ్రంగా దూషిస్తున్నట్టు ఆ ఆడియోలో స్పష్టంగా వినపడుతుంది. రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే తన దగ్గర ఉన్న మనుషుల్లో ఒకరిని ఇలా తీవ్ర పధజాలంతో దూషించారనే వాదనా ఉంది. సదరు ఆడియోలో నేను నీకంటే పెద్దిoట్లో పుట్టినదాన్ని, మీరు చెత్తబుట్టలో పుట్టారు అంటూ వాడిన లం…. కొడుకుల పదజాలం ఆమెలోని పెత్తందారి పోకడలని అహంకారాన్ని బట్టబయలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉన్న ఈ సమయంలో నారా భువనేశ్వరి పచ్చి బూతులతో దూషించిన ఆ ఆడియో వైరల్ గా మారడంతో తెలుగుదేశం శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. తమ పక్క ఉన్న వారే ఇలా లీకులు ఇస్తుంటే ఇక ఎవరిని నమ్మగలం అంటూ టీడీపీ సోషల్ మీడియా శ్రేణులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆడియో పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.