ఒకే ప్రాజెక్ట్‌కి తండ్రి రెండు సార్లు కొడుకు ఒకసారి శిలా ఫలకం వేస్తే జనాలు నవ్వుతారన్న సోయి లేని తండ్రి కొడుకులు .
టీడీపీ చేయలేక వదిలేసిన పనులకి లోకేష్ మళ్ళీ మళ్ళీ శిలా ఫలకాలు వేస్తున్నాడా. యువగళం పేరిట ప్రతి వంద కిలోమీటర్లకి ఒక హామీతో వేస్తున్న శిలా ఫలకాలన్ని చంద్రబాబు శిలా ఫలకాల్లాగే శిధిలం కావాల్సిందేనా . కొద్ది కాలం క్రితం వరికెపూడిశెల కడతానంటూ వినుకొండలో వేసిన శిలాఫలకం చూస్తే అవుననిపించక మానదు.
1995 మార్చ్ 5 న వరికపూడిశెల నిర్మాణం చేస్తానంటూ శంఖుస్థాపన చేశాడు నాటి సీఎం చంద్రబాబు. తర్వాత తొమ్మిదేళ్లలో ఆ రాయి తప్ప మరో ఇటుక కూడా వేయలేదు బాబు .
తిరిగి 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ విషయమై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అసెంబ్లీ వేదికగా పదే పదే ప్రశ్నించగా కేంద్ర అనుమతులు లేవు కాబట్టి ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదు. అందువలన ప్రాజెక్టు ప్రతిపాదన విరమించుకొంటున్నాం అని అసెంబ్లీ వేదికగా తేల్చి చెప్పారు. ఆ తర్వాత 08-august-2018 లో మాచర్ల వచ్చిన నారా లోకేష్ త్వరలో వరికపుడిశెల ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి పోయారు కానీ ఎక్కడి గొంగళి అక్కడే సామెతగా ఏ విధమైన పురోగతి లేదు.
తిరిగి 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు ప్రాజెక్టు నిర్మాణం కోసం అంటూ హడావుడిగా జీవో ఇచ్చి, 400 కోట్ల కేటాయింపు అంటూ టెండర్లు పిలిచి ఏ విధమైన కేంద్ర అనుమతులు లేకుండానే టెండర్లు పిలిచి శంఖుస్థాపన చేసి ఎన్నికలకు వెళ్ళాడు బాబు . కానీ ఈసారి ప్రజలు నమ్మలేదు.
2019 లో వైఎస్సార్సిపి ప్రభుత్వం ఏర్పడ్డాక మాచర్ల, వినుకొండ నియోజక వర్గాల్లో డెబ్భై వేల ఎకరాలకు సాగు నీరు, నాలుగున్నర లక్షల మందికి త్రాగునీరు అందించే వరికపుడిశెల ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన జరిగినా కేంద్రం నుండి రావాల్సిన అనుమతులు కరోనా కారణంగా కుంటుపడ్డాయి.
అయితే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ లావు కృష్ణ దేవరాయలుల అవిరళకృషితో 19-మే-2023 నాటికి కేంద్ర పర్యావరణ, జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతులతో పాటు,ప్రాజెక్టుకి అవసరమైన మేర అటవీ భూమిని డీ నోటి ఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.
దరిమిలా ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకొన్న ప్రభుత్వం 1600 కోట్ల అంచనా వ్యయంతో గత నెల అనగా 15-11-2023 న సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంఖుస్థాపనకు నోచుకొని నిర్మాణ దశలో పురోగమిస్తుంది .
అయితే కొద్ది నెలల క్రితం వినుకొండలో పాదయాత్ర చేసిన లోకేష్ తాను వరికపూడిశెల నిర్మిస్థానంటూ వినుకొండ పక్కనే ఉన్న కొండ్రముట్ల గ్రామంలో శిలాఫలకం వేయడం విశేషం . ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతం మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం, అక్కడ కాకుండా ప్రాజెక్టు వలన ప్రయోజణం పొందే ప్రాంతం కూడా కాని కొండ్రముట్లలో శిలా ఫలకం వేయడంలోనే లోకేష్ చిత్తశుద్ధి తెలుస్తుంది.
ఒకే ప్రాజెక్టుకి తండ్రి రెండు సార్లు శిలా ఫలకం వేసి 14 ఏళ్ళు అధికారంలో ఉన్నా ఒక్క ఇటుక కూడా పేర్చని ప్రాజెక్ట్ కి కొడుకు మూడో సారి శిలా ఫలకం వేస్తే అక్కడి ప్రజలు తరుముతారని సుదూర ప్రాంతంలో శిలా ఫలకం వేయడం లోకేష్ అతి తెలివికి నిదర్శనం .