Aqua Park : నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థిక శాఖా మంత్రి ప్రత్యేకించి సమీకృతపార్కుల గురించి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 5 (Aqua Park) పార్కులను ఏర్పాటు చేయాలని ఈ బడ్జెట్ లో నిర్ణయించగా అందులో ఒకటి ఖచ్చితంగా ఏ.పీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.
ఆక్వా ఉత్పత్తి, ఉత్పాదకత మొదలగు రంగాల్లో దేశంలో గుజరాత్ ముందంజలో ఉంది. అయితే ఈ ఉత్తత్తుల్లో గుజరాత్కే పోటీ ఇస్తూ ఆంధ్ర నిలవడం గమనార్హం. సీయం జగన్ ఆక్వా రంగంలోనూ అవకాశాలను, సమస్యలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రోత్సహిస్తూ ఉండటంతో ఆక్వా ఎగుమతుల్లోనూ ఏపీ మొదటి స్థానానికి పాకుతుంది.
ఈ నేపథ్యంలో ఆంధ్రాలోని కోస్తా జిల్లాలను కలుపుతూ సమీకృత ఆక్వా పార్కు రావొచ్చు అంటూ ఆక్వా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్లోని అంశంతో పాటు కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మత్స్య సంపదయోజన విస్తరణకు కూడా ఏపీలో పెడితే ఆంధ్రాకు భారీ ప్రోత్సహకాలు రావడం తధ్యం.