సామాజిక మాధ్యమాల్లో జనసేన టీడీపీ ఉన్మాద వేధింపులకు గీతాంజలి అనే మహిళ బలైన విషయం తెలిసిందే. ప్రభుత్వ పథకాల వల్ల లబ్ది చేకూరిందని నిష్కల్మషంగా గీతాంజలి వెల్లడించడమే ఆమె పాలిట శాపంగా మారింది. ఆన్లైన్ క్రూర మృగాల దాడిని తాళలేక ట్రైన్ కి ఎదురు వెళ్లి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. ముక్కుపచ్చలారని ఇద్దరు పసి బిడ్డలను అనాధలు చేసి అర్ధాంతరంగా తనువు చాలించిన గీతాంజలి ని తలుచుకోని ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉంది. సోషల్ మీడియా వేధింపుల కారణంగానే తన భార్య ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త బాలచందర్ పోలీసులకు స్పష్టం చేశారు.
కాగా జనసేన టీడీపీ సోషల్ మీడియా రాక్షసత్వానికి బలైన గీతాంజలి కుటుంబానికి అండగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి సీఎం జగన్ దృష్టికి గీతాంజలి ఉదంతాన్ని తీసుకెళ్లగా ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఆదేశించడంతో 20 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. గీతాంజలిని ఆత్మహత్యకు పురికొల్పిన ట్రోల్ చేసిన ఐడీలను గుర్తించామని కొందరు పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఏ సోషల్ మీడియాలో అయితే టీడీపీ, జనసేన మృగాల దాటికి గీతాంజలి మృతి చెందిందో అదే సోషల్ మీడియా వేదికగా ఆ మృగాల పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ లో ట్రోలింగ్ ని కట్టడి చేయాలని, ఆ నిందితులను కఠినంగా శిక్షించాలని ఇలా పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.