రాష్ట్రంలోని ప్రతి విద్యార్ధి ఉన్నతంగా చదువుకోవాలి.. ఉన్నత శిఖరాలకు ఎదగాలి.. రానున్న రోజుల్లో ప్రపంచస్థాయిలో పోటీపడాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలు.. స్వార్ధపూరిత రాజకీయాలతో కలుషితమైపోయిన పచ్చ పార్టీ నేతలకు, ఎల్లో మీడియాకు అర్ధంకావు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో విరాజిల్లుతున్న విద్యా రంగాన్ని దేశదేశాల నేతలు అభినందిస్తుంటే పచ్చ పత్రికలు మాత్రం వక్రబుద్ధితో చూస్తూ అసత్యారోపణలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యావిధానాలు బాగోలేదంటూ వైఎస్ జగన్ తీసుకువచ్చిన సంస్కరణలు పూర్తిగా నిలిపివేయాలన్న ధోరణిలో విషపు వార్తలు ప్రచురిస్తున్నారు.
వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ కుప్పకూలింది. ప్రభుత్వ బడుల్లో కనీస సదుపాయాలు కల్పించలేక సరిపడినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతో 2014-2019 మధ్య 1,785 పాఠశాలలను మూసివేశారు. విద్యా బోధన ప్రమాణాలు దెబ్బ తిన్నాయి. ఎంతసేపూ ప్రైవేటు విద్యా రంగానికి నిచ్చెనలు వేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రభుత్వ విద్యా రంగాన్ని పాతళంలోకి తోసేసింది. ఫలితంగా పిల్లల చదువులు దెబ్బతిన్నాయి.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి.. ఆరో తరగతికి వచ్చే విద్యార్థులు తక్కువ స్టాండర్డ్స్ లో వస్తున్నారని, బేసిక్స్ కూడా తెలియక సిలబస్ ను అర్ధం చేసుకోలేకపోతున్నారని ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు అందాయి. దీనిపై లోతుగా పరిశీలనలు జరిపిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరికొత్త విధానాలతో పిల్లల బడి చదువులను సులభతరం చేసింది. సబ్జెక్ట్ టీచర్స్ తో విద్యాబోధన విధానాన్ని మార్చింది. పేద పిల్లలు కూడా కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులతో సమానంగా ఎదగాలన్న వైఎస్ జగన్ ఆకాంక్షతో.. ఎంతోమంది ఉపాద్యాయుల సూచనలతో ‘నాడు-నేడు’ పథకంతో సంస్కరణలు చేపట్టింది. చంద్రబాబు హయాంలో మూతపడిన స్కూళ్లన్నింటినీ తిరిగి తెరిచింది. 2022-23 విద్యా సంవత్సరంలో కిలోమీటరు లోపు ఉన్న 8,643 ప్రాథమిక, యూపీ పాఠశాలలను గుర్తించింది. వీటీలో కేవలం 4,943 పాఠశాలలను సమీపంలోని 3,557 ప్రీ-హై స్కూల్స్, హైస్కూళ్లతో మ్యాపింగ్ చేసింది. ఫలితంగా 3 నుంచి 5 తరగతులకు చెందిన 2,43,540 మంది విద్యార్థులకు బీఈడీ అర్హత గల సబ్జెక్టు టీచర్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో అభ్యాసన సామర్ధ్యాలు బలోపేతమవుతున్నాయి. సబ్జెక్టు టీచర్ల పర్యవేక్షణ ఉండడంతో దీర్ఘకాలంలో 3వ తరగతి నుంచి పిల్లల పనితీరు మెరుగుపడుతుంది. మ్యాపింగ్ కారణంగా ఏ పాఠశాలనూ మూసివేయలేదు. మ్యాపింగ్ చేసిన ఉన్నత పాఠశాలల్లో 66,245 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు 3-10 తరగతుల్లో బోధన చేయాలి. ఇందులో 59,663 మంది ఉపాధ్యాయులు ఇప్పటికే పనిచేస్తున్నారు. పదోన్నతి ద్వారా ఈ విద్యా సంవత్సరంలో 6,582 మంది సబ్జెక్ట్ టీచర్లను మ్యాప్ చేసిన హైస్కూళ్లకు పంపించారు.
ప్రభుత్వ విద్యలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 1, 2 తరగతుల బోధన, అభ్యాసంపై దృష్టి కేంద్రీకరించి, తదుపరి అభ్యాసానికి పునాది వేసింది. పైగా అంగన్వాడీలను పీపీ-1, పీపీ-2 బోధన స్థాయికి పెంచింది. 1, 2 తరగతుల నమోదు ఆధారంగా అన్ని ఫౌండేషన్ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించారు. ప్రాథమిక విద్య బలంగా ఉంటే తదుపరి తరగతులలో పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవన్న ఉద్దేశంతో ప్రభుత్వం విద్యార్ధులకు మెరుగైన విద్యను చిన్న తరగతులనుండే అందిస్తుంది.
విద్యా వ్యవస్థలో మార్పును, సంస్కరణలను స్వాగతించకపోతే వర్తమానంలో యువత రాతి యుగంలోనే ఆగిపోతుందన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాటలను దృష్టిలో పెట్టుకునే పునాదుల నుండే విద్యార్ధులను తీర్చేదిద్దే విధంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇవేమీ అర్ధం చేసుకోలేని పచ్చ పత్రిక తోచినవిధంగా తప్పుడు వార్తలు ప్రచురిస్తుంది.