వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగంలో తెచ్చిన సంస్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన పరేడ్‌లో ఏపీ విద్యాశాఖ శకటాన్ని ప్రదర్శించింది. డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో రూపొందించిన ఈ శకటానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. పీపుల్స్ చాయిస్ విభాగంలో తృతీయ స్థానం దక్కింది. విద్యా రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతికి ఇది నిదర్శనం.
ఇదీ జగన్ మార్క్
విద్యా వ్యవస్థను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాశనం చేసిందని, ఇంగ్లిష్ మీడియం పేరుతో హంగామా చేస్తోంది తప్ప ఆ రంగంలో జరిగిన అభివృద్ధి శూన్యమని చంద్రబాబు, ఎల్లో మీడియా ఆరోపణలు చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో జరిగింది వేరు. ఈ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు జగన్ ప్రభుత్వం 2019 నుంచి ఇప్పటి వరకు రూ.73,417 కోట్లు ఖర్చు చేసిందని గణాంకాలు చెబుతున్నాయి. అమ్మఒడి పథకాన్ని ప్రారంభించి 44 లక్షల మందికి లబ్ధి చేకూర్చారు. దీనిపై రూ.26,067 కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వ బడుల అభివృద్ధికి మన బడి నాడు – నేడు పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని కింద రూ.11,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. వేల సంఖ్యలో బడుల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మొత్తంగా సర్కారు పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. ఈ మార్పును ఇటీవల ఇండియాటుడే ప్రతినిధులు నేరుగా చూసి సీఎం దూరదృష్టిని అభినందించారు. తాజాగా ఏపీ శకటానికి అవార్డు రావడంతో ఎల్లో మీడియా బాధ వర్ణనాతీతంగా ఉంది. తాము ప్రజలను మభ్యపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. జగన్ తన పాలనలో చేసిన పనులతో సమాధానం చెబుతున్నాడని ఉడికిపోతోంది.