ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమితులైన నాటి నుండి బిజెపికి ప్రజల్లో పలుకుబడి రోజు రోజుకీ దిగజారడమే కాకుండా బిజెపిలోని నాయకులు,కార్యకర్తలు తమ పార్టీ బిజెపి కోసం పనిచేస్తుందా లేక టీడీపీకోసమా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడి కోసం పనిచేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేసిన సందర్భాలను మనం ప్రతి రోజూ చూసాము. ఇప్పుడు తాజాగా ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి తను పోటీ చేస్తున్న రాజమండ్రిలో ప్రచార రథాలను సిద్ధం చేసుకొని ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక్కడే అసలు విషయం వుంది. ఇక్కడ తను పోటీ చేసే రాజమండ్రి ఎంపీ స్థానం పరిధిలో వున్న అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్ధుల ఫోటోలను తన ప్రచార రథంపై వుంచి వారి పక్కనే వారి పార్టీ సింబల్ వుంచారు ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చారు పురంధేశ్వరి. టీడీపీ నుండి పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు అయిన రాజమండ్రి రూరల్ లో బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, గోపాలపురం మద్దిపాటి వెంకట రాజు , కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు…ఇలా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫోటో పక్కనే వాళ్ళ పార్టీ గుర్తు కూడా కనపడేలా సిద్ధం చేసుకున్నారు .అలాగే జనసేన అభ్యర్థులు అయిన నిడదవోలు లో కందుల దుర్గేష్, రాజా నగరం లో బత్తుల బలరామకృష్ణ ఇలా వాళ్ళ ఫోటోలతో పాటు వారి పార్టీ గుర్తు కూడా తెలిసేలా ఏర్పాట్లు చేసుకున్నారు
ఇక తమ పార్టీ బిజెపి తరుపున తన ఎంపీ స్థానం కింద పోటీ చేసే ఏకైక స్థానం అయిన అనపర్తి లో కృష్ణంరాజు ఫోటో బదులు టీడీపీ నాయకుడు అయిన నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ఫొటో పెట్టీ పక్కన గుర్తు మాత్రం ఇంకా పెట్టకుండా ప్రచార రథాలను తిప్పుతున్నారు. ఇక్కడే పురంధేశ్వరి , తన బావ చంద్రబాబు మధ్య ఉన్న చీకటి కోణాలు భయపడుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు అనపర్తి లో చంద్రబాబు సూచనల మేరకే కృష్ణంరాజు బదులు టీడీపీ నాయకుడు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డిని బిజెపిలోకి తీసుకొని బిజెపి టిక్కెట్ కేటాయిస్తున్నారని తెలుస్తుంది. అందుకే ఇలా కృష్ణంరాజు బదులు నల్లమిల్లి ఫోటోలతో ప్రచార రథాలను సిద్ధం చేసారు. ఇంకా నల్లమిల్లి బిజెపిలో అఫిషియల్ గా జాయిన్ అవ్వలేదు కాబట్టి సింబల్ పెట్టలేదు అని తెలుస్తుంది.
తన సొంత పార్టీ అభ్యర్థి ఫొటో కాకుండా టీడీపీ లో టికెట్ కోసం పోటీ పడుతున్న నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ఫొటో పెట్టడంతోనే పురంధేశ్వరి కేవలం తమ కుటుంబం కోసం తన బావమరిది కోసమే పని చేస్తున్నారు అనే విషయం బహిర్గతమైనది. అంతే కాకుండా తన బావమరిది కోసం నిజమైన బిజెపి నాయకులకు టికెట్ దక్కకుండ చేసి, అటూ పార్టీని ఇటూ కార్యకర్తల్ని మోసం చేస్తున్నారు అని బిజెపి నాయకులు కార్యకర్తలు తమ అభిప్రాయాలను పబ్లిక్ గా వినిపిస్తున్నారు.