AP Assembly: రాష్ట్రంలో జరగబోవు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికెషన్ అతి త్వరలో రానుంది. ఈలోపుగానే రాష్ట్ర అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు కూడా జరగనున్నాయి. ఈసారి సమావేశాలు మూడు నుంచి అయిదు రోజుల పాటు జరగనున్నట్లు సమాచారం.
2024-25 సంవత్సరానికి గాను మొదటి మూడునెలల బడ్జెట్ ఆమోదం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి అయిదు నుంచి ఓటాన్ బడ్జెట్ సమావేశాలను అయిదురోజుల పాటు నిర్వహించి సంక్షేమ పధకాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎన్నికల ముందు ప్రజలకు వరాల జల్లు కురిపించాలని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. సుమారు 75 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్ట అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అదే కనుక జరిగితే ప్రజలకోసం మరిన్ని సంక్షేమ పధకాల నిధులు విడుదల అయ్యే అవకాశాలు ఉంటాయి