తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా గుడివాడ రాజకీయం వేడెక్కింది. చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి చేస్తున్న “రా…. కదిలి రా” సభ కేంద్రంగా రాజకీయ ఘర్షణలకు కాలుదువ్వుతున్న సమయానికి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో పరిస్థితి సద్దు మణిగింది.
అసలేం జరిగింది??? యన్టీఆర్ ప్రతి వర్ధంతికి చంద్రబాబు హైదరాబాద్లోని యన్టీఆర్ ఘాట్ సందర్శించడం, నివాళులు అర్పించడం అందరికీ తెలిసిందే. అలానే, తెలుగుదేశంతో రాజకీయ ప్రవేశం చేసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి యన్టీఆర్ మీద ఉన్న భక్తి శ్రద్ధలూ తెలిసినవే. ఆయన ప్రతి ఏడూ గుడివాడలోని యన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు.
అయితే, ఈసారి ఎన్నికల ప్రచార సభ “రా… కదిలి రా” కోసం చంద్రబాబు గుడివాడలో ఉన్నారు. పైగా, హైదరాబాదులో బాలకృష్ణ యన్టీఆర్ ఘాట్ వద్ద, జూనియర్ యన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీలు పీకేయమని చెప్పిన వీడియో వైరలవడంతో… గుడివాడలోని తెదేపా కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇక్కడ స్థానికంగా ఉన్న యన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన జెండాలు పీకేసి వాటి స్థానంలో తెదేపా జెండాలు పెట్టడంతో వివాదం మొదలైంది.
అంగళ్ళ తరహాలో అల్లర్లు జరిగే లోపు పోలీసులు లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లోకి తీసుకున్నారు.
అసలే ఇలాంటి అవకాశాలు గమనించే చంద్రబాబు ఎన్నికల ప్రచార సభని, వర్ధంతి నివాళి సభగా మార్చడానికి శత విధాలా ప్రయత్నించి, విద్వేషాలు రెచ్చగొట్టరని గ్యారంటీ ఏమిటి అని గుడివాడ సామాన్య ప్రజలు భయపడుతున్నారు.