కూటమి పేరుతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ తమకు కేటాయించిన సీట్లు కూడా తిరిగి టీడీపీకి ఇవ్వడంతో మనస్థాపం చెందిన కీలక నాయకులు జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అవుతున్నారు. ఈరోజు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీ జనసేనకు రాజీనామా చేసి జగన్ వైసీపీలో సమక్షంలో చేరారు. పాముల రాజేశ్వరీ 2004 లో నగరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున విజయం సాధించారు. తరువాత 2009 లో మొదటిసారి ఏర్పడ్డ పి. గన్నవరం నియోజకవర్గం నుండి మరొకసారి విజయం సాధించారు. తరువాత వైసీపీలో జాయిన్ అయ్యారు. అనంతరం 2018లో జనసేనలోకి జాయిన్ అయ్యి 2019 ఎన్నికల్లో పి. గన్నవరంలో జనసేన తరుపున పోటీ చేసి 36,259 ఓట్లు సంపాదించారు.
ఇప్పుడు జనసేన పార్టీ దళితులకు వ్యతిరేఖ పార్టీలు అయిన టీడీపీ, బిజెపి తో పొత్తు పెట్టుకోని దళితుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తున్నారు. ఏదైనా ఒక నిర్ణయం పార్టీలో తీసుకునే ముందు పార్టీలో ఉన్న నాయకుల మాటలకు విలువ ఇవ్వడం లేదు. పిలిచి మాట్లాడింది లేదు. పవన్ కళ్యాణ్ తనే ఓక నిర్ణయం తీసుకుని అందరి నిర్ణయంగా బయటకు చెబుతున్నారు. మా అభిప్రాయాలను వెల్లడిద్దాం అన్నా, పొత్తు గురించి, నియోజవర్గ సమస్యలు గురించి మాట్లాడదాం అంటే కనీసం అపాయింట్మెంట్ అడిగితే పవన్ కళ్యాణ్ ఇవ్వరు, అసలు ఏపీలో వుండరు ఎప్పుడు హైదరాబాదు లో వుంటారు అని పాముల రాజేశ్వరీ తెలిపారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులను పిలిచి భాద్యతలు అప్పగించలేదు అని తెలిపారు. దీనితో జనసేన పార్టీ విధానాల మీద పవన్ కళ్యాణ్ మీద విరక్తి కలగడంతో రాజీనామా చేసి బస్సుయాత్రలో వున్న వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యారు.