గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశంగా మారిన నరసరావుపేట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధిత్వం ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. నియోజకవర్గంలోని 7 స్థానాలు ఓసీ అభ్యర్ధులే ఉండటంతో సామాజిక న్యాయంలో భాగంగా ఎంపీ అభ్యర్ధి బీసీలకి కేటాయించాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు వచ్చిన వార్తలు అందరికి తెలిసిందే.
ఈ నేపధ్యంలోనే సిట్టింగ్ ఎంపీగా ఉన్నా లావు కృష్ణ దేవరాయలని గుంటూరు ఎంపీగా పంపించేందుకు జగన్ నిర్ణయం తీసుకుని అదే విషయాన్ని కృష్ణదేవరాయలకి చెప్పినా ఆయన దానికి వ్యతిరేకత వ్యక్తంచేసి చివరికి పార్టీకి, ఎంపీ అభ్యర్ధిత్వానికి సైతం రాజీనామ చేశారు. దీంతో రాజకీయాలకి పుట్టినిల్లుగా పేరొందిన పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట ఎంపీ అభ్యర్ధి ఎవరు వస్తారనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపధ్యంలో ఎవరి ఉహకు అందని విధంగా జగన్ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది.
నర్సరావుపేట లాంటీ రాజకీయ హీట్ ఉన్న సెగ్మెంట్ కి అంతే మాస్ ఇమేజ్ ఉన్న నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ గారిని జగన్ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. అనిల్ అభ్యర్థిత్వం దాదాపుగా ఖాయంగా వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇక అధికార ప్రకటనే తరువాయిగా కనిపిస్తుంది.
ఇదే జరిగితే బహుశా లావు కృష్ణ దేవరాయలు పోటీకి కూడా సాహశించకపోవచ్చు .