ఇటీవల ఒక టైల్స్ షాపులో తనిఖీలు జరుగుతుంటే అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అడ్డుకొని దౌర్జన్యం చేసిన విషయం తెలిసిందే . ఆ పై అధికారులు పిర్యాదు మేరకు నేడు అనకాపల్లి డీఎస్పి విచారణ చేపట్టారు.
సాధారణ తనిఖీల్లో భాగంగా ఒక టైల్స్ షాప్ లో తనిఖీలకు వెళ్ళిన డిఆర్ఐ అధికారులను కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అడ్డుకుని దుర్భాషలు ఆడడమే కాకుండా, వారిని బెదిరించి వారి చేతిలోని ఫైళ్లను సైతం లాక్కొని దౌర్జన్యం చేసి వారి విధులకు ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. తమ విధులకు అడ్డు రావద్దని అధికారులు ఎంత చెప్పినా వినకుండా అధికారులపై దౌర్జన్యానికి దిగిన విషయంలో అధికారులు పోలీసులును ఆశ్రయించారు.. ఈ మేరకు అధికారులపై దౌర్జన్యం చేసిన కేసులో పోలీసులు సీఎం రమేష్ కు నోటీసులు ఇచ్చారు.
అధికారులపై దౌర్జన్యం కేసులో నోటీసులు అందుకున్న సీఎం రమేష్ ఈరోజు అనకాపల్లి డిఎస్పి సమక్షంలో విచారణకు హాజరయ్యారు. వృత్తి ధర్మం నిర్వహిస్తున్న డిఆర్ఐ అధికారులపై ఎందుకు దౌర్జన్యానికి దిగారు? సాధారణ తనిఖీల్లో భాగంగా పనిచేస్తున్న అధికారును మీరు ఎందుకు ఇబ్బంది పెట్టారని ప్రశ్నించారు. తనిఖీల సమయంలో ప్రభుత్వ ఉద్యోగి చేతుల్లో ఫైళ్లను ఎందుకు లాక్కున్నారు అని డి.ఎస్.పి అప్పలరాజు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే విచారణకు హాజరైన సీఎం రమేష్ ముగ్గురు లాయర్లు, భారీగా రౌడీ మూక తో చోడవరం పోలీస్ స్టేషన్ కి రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.