రాష్ట్ర ప్రజల ఆమోదం లేని రాజధాని అమరావతి. ఇది కేవలం చంద్రబాబు మొదలుపెట్టిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా పేరుగాంచింది. అయినా ఆయన ఇంకా ఆ రాగంలోనే పాటలు పాడుతున్నాడు. భోగి పండగ నాడు తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి కీలక వ్యాఖ్యలు చేశాడు. అమరావతి నుంచే త్వరలో సంక్షేమ పాలన ప్రారంభమవుతుందని ప్రకటించారు. అదే రాజధాని అని, ఆ ప్రాంత రైతుల పోరాటం వృథా కాదని చెప్పారు. దీనిని బట్టి ఆయన వచ్చే ఎన్నికలకు అమరావతి అజెండాతోనే వెళ్తున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్లాన్ వేసి దోపిడీ
బాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి పేరుతో భ్రమలు కల్పించారు. అంతులేని దోపిడీకి శ్రీకారం చుట్టారు. అప్పటి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, పలువురు వ్యాపారవేత్తలు బాగా సంపాదించారు. రైతుల పొట్ట కొట్టి ఎల్లో గ్యాంగ్ మొత్తం లబ్ధి పొందింది. రాజధాని ముసుగులో నారా వారు భూ కుంభకోణానికి తెరతీశారు. అందులో ప్రధానమైంది ఐఆర్ఆర్ (ఇన్నర్ రింగ్ రోడ్డు) అక్రమాలు. గత ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్‌గా బాబు, వైస్ చైర్మన్‌గా పొంగూరు నారాయణ వ్యవహరించారు. ఈ సమయంలో లింగమనేని రమేష్‌తో కలిసి క్విడ్ ప్రోకు పాల్పడ్డారు. ఆయనకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారు. లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు, రాజధాని నిర్మాణం అయ్యాక ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చేశారు. అలాగే బాబు కుటుంబానికి చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. కేవలం కాగితాలపైనే అలైన్మెంట్ మార్పులు చేసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం వారికే సాధ్యమైంది. లింగమనేని అనుకూలంగా వ్యవహరించి బాబు హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు పొందారు. కరకట్ట నివాసం గిఫ్ట్‌గా వచ్చింది. నారాయణ కుటుంబసభ్యులు సీడ్ క్యాపిటల్‌లో 75,888 చదరపు గజాల ప్లాట్లు అందుకున్నారు. పనిలో పనిగా దత్తపుత్రుడు పవన్‌కు 2.40 ఎకరాల భూమి ప్యాకేజీ కింద వచ్చింది. ఐఆర్ఆర్పై జగన్ ప్రభుత్వం దర్యాప్తు చేయించింది. సీఐడీ ఈ కేసులో బాబు ఏ–1గా, నారాయణ ఏ–2గా, ఏ–3గా చంద్రబాబు బినామీ లింగమనేని రమేష్, ఏ–6గా హెరిటేజ్ ఫుడ్స్, ఏ–14గా నారా లోకేశ్‌ను చేర్చింది. ఇటీవల బాబు ఈ కేసులో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చున్నారు. క్విడ్ ప్రోకో కింద నారా వారు, నారాయణకు వచ్చిన భూములు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేయాలని సీఐడీ నిర్ణయించి ఇటీవల న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. భూ సేకరణలో ఇష్టానుసారంగా అప్పటి ప్రభుత్వం వ్యవహరించింది. రైతులకు ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయి. డిజైన్ల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. వివిధ దేశాలకు తిరిగి ప్రభుత్వ ధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేశారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి.
అందరూ వ్యతిరేకించినా..
పంటలు బాగా పండే భూములు తీసుకోవద్దు. 33 వేల ఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్ చేయడం మినహా ఆ ప్రాంతం వారికి ఎటువంటి ఉపయోగం ఉండదని, రాజధాని అక్కడ వద్దని మేధావులు, ప్రజాస్వామ్యవాదులు చెప్పినా చంద్రబాబు వినలేదు. ఆనాడు వ్యతిరేకత వచ్చినా ధన దాహంతో రెచ్చిపోయారు. ఎల్లో మీడియాలో అనుకూలంగా కథనాలు రాయించారు. అమరావతి పేరుతో జరిగిన దోపిడీ కళ్ల ముందు కనిపిస్తున్నా అంతకు మించిన అద్భుతం లేదంటూ ఆనాడు ప్రత్యేక వార్తలు వడ్డించారు. అలాVó అప్పట్లో పలు వేదికలపై రాజధాని అంశంలో టీడీపీ ప్రభుత్వ తీరును పవన్ కళ్యాణ్ కూడా తప్పుపట్టారు. అయితే ఆయనకు ప్యాకేజీ కింద భూములు వచ్చేసరికి తర్వాతి కాలంలో బాబుకు వంత పాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అధికార వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టింది. మూడు రాజధానులను తెరమీదకు తెచ్చింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్యాంధ్ర సమగ్రంగా అభివృద్ధి చెందేందుకు శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నంఉంటే బాగుంటుందని చెప్పారు. పైగా అధికార వికేంద్రీకరణ దేశంలో కొత్త కాదు. పలు రాష్ట్రాల్లో ఈ విధానం ఉంది. అయితే బాబు కుట్రలకు తెరతీశారు. రాజధాని తరలిపోతోందని రెచ్చగొట్టారు. రైతుల ముసుగులో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల చేత ఆందోళనలు చేయించారు. అమరావతి ఉద్యమం పేరుతో మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ అండ్ కో రాజకీయాలు చేస్తోందని జాతీయ మహిళా చైర్పర్సన్ రేఖాశర్మ విమర్శించారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. బాబు రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని చూశారు. అయితే ఆయన్ను ప్రజలు పట్టించుకోలేదు. వికేంద్రీకరణకు జై కొట్టారు. అలాగే ఇటీవల టీడీపీ నుంచి కమ్మ సామాజిక వర్గం నాయకులు బయటికొచ్చారు. వారు కూడా అమరావతి విషయంలో బాబు తీరును తప్పుపట్టారు. 12వ తేదీన విజయవాడ ఎంపీ కేశినేని నాని రియల్ ఎస్టేట్ కోసమే అమరావతి అని విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో కుండబద్ధలు కొట్టారు. భూములు తీసుకుని రైతుల్ని చంద్రబాబు నట్టేట ముంచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదో పెద్ద భూ కుంభకోణమని స్పష్టం చేశారు.
అయినా బాబు వినడు
ఇప్పటికీ అన్ని వర్గాల్లో అమరావతి విషయంలో వ్యతిరేకత ఉన్నా చంద్రబాబు మారలేదు. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఓట్లు కొల్లగొట్టేందుకు అమరావతి నుంచే పాలన సాగిస్తామని ప్రకటించారు. ఆయన దృష్టిలో అది దేవతల రాజధానట. అయితేఅధికారం ఉన్నప్పుడు మాత్రం శాశ్వత బిల్డింగ్ ఒక్కటీ కట్టింది లేదు. కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని కాజేశారు. సినిమా దర్శకులతో కలిసి గ్రాఫిక్స్ చూపించి ప్రజల్ని మోసం చేశారు. భూ కుంభకోణానికి పాల్పడిందే కాకుండా నిర్మాణానికి రూ.లక్షల కోట్లు అవుతాయని ఆనాడు చెప్పారు. చివరికి హుండీలు పెట్టి డబ్బు దండారు. ఇటుకల పేరుతో చందాలు తీసుకున్నారు. అమరావతి ఓ భ్రమరావతి అని అందరికీ తెలిసినా వచ్చే ఎన్నికల్లో దాని అజెండాగా ముందుకెళ్తానని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. అది కూడా ఒకప్పుడు వ్యతిరేకించి నేడు.. మద్దతుగా ఉన్న పవన్‌ను పక్కన పెట్టుకుని.. అమరావతి ముసుగులో బాబు జనాన్ని మోసం చేయడం ఇప్పట్లో ఆపేలా లేడు. ఆమోదయోగ్యం కాని రాజధానిని ముందు పెట్టి ఎన్నికలకు వెళ్తున్న ఆయనకు ఓటర్లు గుణపాఠం చెప్పడం ఖాయం.
– వీకే..