2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి టిడిపి, జనసేనబిజెపిలతో కూటమిగా ఏర్పడింది. కూటమిగా ఏర్పడడంతో అన్ని పార్టీలకు ఎక్కువ స్థానాలలో పోటీ చేసే అవకాశం దక్కదు. పొత్తులో భాగంగా జనసేన 175 స్థానాలు గాను 21 స్థానాలలో పోటీ చేస్తూ ఉంది. 21 స్థానాలలో కూడా టిడిపిలో సీట్లు రాని వారిని 12 మందిని ఆ పార్టీలో జాయిన్ చేసుకొని జనసేన తరఫున టికెట్లు కేటాయించడంతో జనసేనలో ఎంతో కీలకంగా పనిచేస్తున్న నాయకులకు అది మింగుడు పడడం లేదు. దీంతో సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోవాల్సి వస్తోంది.
ఈ క్రమంలో జనసేన పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్తూ నాయకులంతా ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్సీపీలో చేరారు. పితాని బాలకృష్ణ, పోతిన మహేష్, శెట్టిబత్తుల రాజాబాబు, బుసనబోయిన వెంకటేశ్వరరావు అలియాస్ బీవీ రావు, పోలసపల్లి సరోజ, పంతం ఇందిర, విజయ గోపాల్, మనో క్రాంత్ రెడ్డి వంటి పలువురు సీనియర్ నాయకులు జనసేన నుంచి బయటికి వచ్చేశారు. ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాజా అమలాపురం లోక్‌సభ నియోజకవర్గంపై డీఎంఆర్ శేఖర్‌కు గట్టిపట్టు ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు డీఎంఆర్ శేఖర్. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఆ స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన శేఖర్ అనునిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉన్నాడు. కానీ పొత్తులో భాగంగా ఆస్థానం నుంచి టిడిపి పోటీ చేస్తోంది.దీంతో ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. టికెట్ రాకపోయినా సరే జనసేనలోనే ఉండాలని నిర్ణయించుకున్న తనకి ఇప్పటివరకు పార్టీ అధిష్టానం నుంచి ఎటువంటి భరోసా దక్కలేదని తెలిపారు. సీట్ రాకపోతే కనీసం పలకరింపుకైన తాము పనికిరామా అనో శేఖర్ మీడియా ముఖంగా తన బాధను పంచుకున్నారు. తన సర్వస్వం ఈ పార్టీ కోసం ఖర్చు చేస్తే ఈ రోజు పలకరింపు లేదని గౌరవం లేని ఇలాంటి చోట ఉండలేనని చెప్పి ఆ పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.