రాజకీయాలు ఎప్పుడు వాడి వేడిగానే సాగుతాయి. ఎన్నికలు అన్న తర్వాత ఎప్పుడైనా ఒకింత ఉత్ఖంటగానే ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది అన్న చందానా చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే మాది గెలుపు అంటే మాది గెలుపు అంటూ ఆయా పార్టీల నేతల ప్రచారాలు హీటెక్కిస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికలతో పోల్చితే 2019 ఎన్నికలు ఎంత ఆసక్తికరంగా జరిగాయి మనందరం చూసాం. ప్రస్తుతం రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికలు 2019 మించిన యుద్ధాన్ని తలపించబోతున్నాయి.
ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసి జనాల్లో విస్తృత ప్రచారం చేస్తుంది. అలాగే మరొక పక్క ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి కూటమి పార్టీలు కూడా వారి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళుతున్నాయి. జగన్ ఈ ఐదేళ్ల పాలన తమకు నచ్చితేనే తన ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని, నా ఐదేళ్ల పాలన చూసి నాకు ఓటు వేయండి అని జనం ముందుకు వస్తున్న పరిస్థితి. అయితే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు మాత్రం తన పాలను చూసి ఓటు వేయండి అనే అడిగే ధైర్యం చేయలేకపోతున్నారు. పైగా గతంలో జగన్ ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కావు అని ఎద్దేవా చేసిన చంద్రబాబు ఇప్పుడు అంతకన్నా అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు సంబంధించి అనేక సర్వేలు తమ తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. అయితే ఇవి అంచనాలు మాత్రమే అయినప్పటికీ ఈ సర్వేలు ఆయా పార్టీల ఫలితాలపై ప్రభావం ఎంతో కొంత ప్రభావితం చూపుతాయి. ఆ క్రమంలోనే ఎన్ని సర్వేలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ప్రజలు మొగ్గు చూపుతున్నారని తేటతెల్లం చేస్తున్నాయి. అందులో భాగంగానే 175 అసెంబ్లీ స్థానాలకి 120 నుండి 130 స్థానాల్లో వైయస్ఆర్సీపీ ఘన విజయం సాధించబోతున్నట్లు తేల్చింది యూనివర్సల్ డిజిటల్ సొల్యూషన్స్ లేటెస్ట్ సర్వే… టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అతి కష్టంగా 45 నుండి 55 స్థానాల మధ్య మాత్రమే గెలిచే అవకాశాలు చెబుతున్నాయి. దీనితో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో ఆనందోత్సాహాలు ఆకాశాన్ని అంటాయి.