2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్రపై ఏ రాజకీయ పార్టీ పట్టు సాధిస్తే ఆ పార్టీకే కిరీటం దక్కనుంది. గత నాలుగు పర్యాయలుగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో అధికంగా ఏ పార్టీ సీట్లు గెలుస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అత్యధిక సీట్లు గెలిచింది. అత్యధిక సీట్లు గెలవడంతో పాటు కూటమి అధికారంలోకి వచ్చింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రలో అత్యధిక సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది.
2024 జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఇరుపార్టీలకు కీలకం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వరసగా 30 సంవత్సరాల సుభిక్ష పాలన ఆంధ్ర ప్రదేశ్ కి అందించాలని దృఢ నిశ్చయంతో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు తాను చెప్పిన హామీలన్నీ నెరవేర్చి, 2024 ఎన్నికలకి తన పాలనలో మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండి లేకపోతే ఓటు వేయొద్దనే నినాదంతో ముందుకి వెళ్తున్నాడు. 2019 ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైన తెలుగుదేశం ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతుందని తద్వారా 2029 ఎన్నికలకు పార్టీ ఉండే పరిస్థితి లేదు అని టీడీపీ నాయకుల అనుకుంటున్నారు. గతం కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో కూటమితో టీడీపీ జతకట్టింది. ప్రస్తుతం అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచార కార్యక్రమాల్లో తిరుగుతున్నాయి. కాగా రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో, ఏ పార్టీ అధికారంలోకి రానుందో వేచి చూడాలి.