Alapati Rajendra Prasad: టీడీపీ నాయకులు ఆవేశంలో ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితిలో మాట్లాడుతున్నారనడానికి గుంటూరు జిల్లా చేబ్రోలులోని వడ్లమూడిలో జరిగిన ‘రా కదలిరా’ సభ ఉదాహరణగా మారింది. నిత్యం సీఎం జగన్ స్మరణ చేస్తున్న టీడీపీ నాయకులు చివరికి టీడీపీ అధినేత చంద్రబాబును పొగడబోయి ఆ పొగడ్తలనును కూడా సీఎం జగన్ కి ఆపాదిస్తున్నారు. తాజాగా టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ (Alapati Rajendra Prasad) ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు సీఎం జగనేనని ఆవేశంగా అనడంతో సభలో ఉన్న చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులు ఖంగుతిన్నాయి. మళ్ళీ సవరించుకుని ఏపీని చంద్రబాబు అభివృద్ధి చేస్తారని చెప్పడంతో టీడీపీ శ్రేణులు సంతోషించాయి.
కాగా టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రా.. కదలి రా సభలకు ప్రజల్లో క్రేజ్ లేకపోవడం టీడీపీ అధినాయకత్వానికి మింగుడు పడటం లేదు. జన సమీకరణ కోసం టీడీపీ నాయకులు శ్రమిస్తున్నా జనం ముఖం చాటేస్తుండడంతో టీడీపీ నాయకులకు ఎటూ పాలుపోవడం లేదు. ప్రజల్లో స్పందన సరిగా లేకపోవడంతో చంద్రబాబు ఖాళీ కుర్చీలకే తన ప్రసంగం వినిపించాల్సిన దుస్థితి తలెత్తింది. ఇప్పటికే టీడీపీ నిర్వహించిన కాతేరు, వడ్లమూడిలో జరిగిన సభలు అట్టర్ ఫ్లాప్ కావడంతో చంద్రబాబు ఆత్మపరిశీలనలో పడ్డారని రాజకీయ పేర్కొంటున్నారు. వచ్చిన అరకొర ప్రజలకు కూడా టీడీపీ నాయకులు అలవాటులో పొరపాటుగా సీఎం జగన్ గొప్పతనం గురించి వివరిస్తుండడంతో చంద్రబాబు అవాక్కవుతున్నారు.