టీడీపీ బీజేపీల పొత్తు ఖరారైనట్లు అధికారిక ప్రకటన వచ్చింది. సీట్ల విషయం బయట పడలేదు కానీ చాలా తక్కువ సీట్లకి బిజెపి ఒప్పుకొందని సమాచారం. అన్ని తక్కువ సీట్లకు బీజేపీ ఎందుకు ఒప్పుకుందనే ప్రశ్న ఇప్పుడు సామాన్యుడిలో కూడా తలెత్తుతుంది. రెండు పార్టీల మధ్య పొత్తులు ఉండటం మాములు విషయమే. కానీ బీజేపీ చంద్రబాబు మధ్య చిగురుంచిన పొత్తు ఎలా సాధ్యపడిందన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలిచేస్తుంది.
చంద్రబాబు బీజేపీ పెద్దలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేసాడు. రాయడానికి వీలు లేని భాషలో బాలకృష్ణ చేత మోడీని తిట్టించి, “మోడీ హటావో దేశ్ కో బచావో ” అని కాలికి బలపం కట్టుకుని దేశమంతా తిరిగి ప్రచారం చేసాడు బాబు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై రాళ్ల దాడి చేయించడమే కాకుండా కాంగ్రెస్ కి 5 వేల కోట్ల ఎన్నికల నిధులు సమకూర్చి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసిన బాబుతో అన్ని తక్కువ సీట్లకు దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ఎందుకు ఒప్పుకుంది? రేపు ఎన్నికలయ్యాక నా అనుంగ శిష్యుణ్ణి బీజేపీలో చేర్పిస్తానని హామీ ఇచ్చి పొత్తుకు ఒప్పించాడా? లేక బీజేపీకి భేషరతుగా లొంగిపోతానని హామీ ఇచ్చి పొత్తుకు ఒప్పించాడా?
ఇప్పటికే అనేక కేసులు ఎదుర్కొంటున్న బాబుకు తోడుగా లక్ష కోట్ల IMG భారత్ అవినీతి కేసులో 2003 నాటి బాబు ప్రభుత్వాన్ని తప్పుపడుతూ సిబిఐ విచారణకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుందా లేక మేము ఆదేశించాలా అని మార్చి 7 ,2024 న తెలంగాణ హై కోర్ట్ అడిగింది. సీబీఐ విచారణ కోరితే తన బండారం బయటపడే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే బీజేపీ పెద్దల ఆశ్రయం కోరితే ముందే బయటపడొచ్చని ఈ స్కెచ్ వేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకోసం తన శిష్యుడు రేవంత్ రెడ్డిని బీజేపీలోకి పంపేందుకు కూడా వెనుకాడటం లేదని, బీజేపీ పెద్దలను కలిసే ముందు రెండు గంటలపాటు ఏకాంతంగా రేవంత్ రెడ్డితో చర్చలు జరిపాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఏపీలో గెలిచే అవకాశం లేదు కాబట్టి బీజేపీ పంచన చేరితే ఎదుర్కోబోయే కేసుల నుండి తప్పించుకోవచ్చని బీజేపీని కాళ్లా వేళ్ళా పడి డీల్ సెట్ చేసి ఉండొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి..