ఇది ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా అయ్యి ఉండి, దమ్మున్న ఛానెల్ అని చెప్పుకునే వారి పత్రికలో ఈనాటి మొదటి పేజీలో మెయిన్ హెడింగ్…
వివరాల్లోకి వెళ్తే… నిన్న చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై, బీజేపీ పెద్దలను కలవడంపై వైసీపీ సోషల్ మీడియా కొన్ని వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించింది, మోడీ ముందు చేతులు కట్టుకుని నిల్చునట్లు గా, షా కాళ్లు మొక్కుతున్నట్టుగా కొన్ని ఫోటోలను ఎడిట్ చేసి వ్యంగ్యంగా కామెంట్లు చేసారు…
ఇక వాటిని పట్టుకుని ఎలుకకు పోస్టుమార్టం చేసినట్టు మెయిన్ ఎడిషన్ లో మొదటి పేజీలో “ బతుకులు” అంటూ రాసుకొచ్చాడు రాధాకృష్ణ… ఆ ఎడిటెడ్ ఫోటో లో ఉన్న బాబు ఫోటో ఎప్పటిది? మోడీ ఫోటో ఎప్పటిది? షా ఫోటో ఎప్పటిది అంటూ ఒక పేజీ మొత్తం కేటాయించేశాడు.. పాపం కింద ఒక మూలన రాష్ట్ర ప్రయోజనాలు కోసం టీడీపీ, దేశ ప్రయోజనాల కోసం బీజేపీ ఎందాకైనా వెళ్తాయని బాబు అన్నట్లు, బాబు తో షా మీటింగ్ జరిగినట్లు ఒక ఫోటో వేశాడు.. పైన చిన్నగా ఫైల్ ఫోటో అని వేశాడు… ఎంత దరిద్రం?
రాధాకృష్ణ…. నువ్ బాబు షా కలిసి మాట్లాడుకున్నారు అని వేసిన ఫోటో ఎలా అయితే నీ క్రియేటివిటీ నో, ఇక్కడ సోషల్ మీడియా లో ఉన్న వాళ్లు బాబు యొక్క వ్యక్తిత్వాన్ని చూపిస్తూ చేసిన ఎడిట్ లు కూడా క్రియేటివిటీ నే రా దాకృష్ణ..
మీ మీ పత్రికల్లో కింద కార్టూన్ లు వేస్తారు కదా? బ్యాగులు సర్దు అన్నట్టు, వార్తలు చూస్తూ టీవీ లు పగలగొడుతున్నట్టు…… అవి మీ టాలెంట్ అయితే… పాపం పేద పిల్లలు కదా ఈ సోషల్ మీడియా లో ఉండేది కార్టూన్ లు ఎఫర్ట్ చేయలేరు.. అందుకే వాళ్ల దగ్గరున్న చిన్న ఫోన్ లలోనే, బాబు ఎంత నీచానికైనా దిగజారతాడు అన్నట్లు, అందితే జుట్టు, లేకుంటే కాళ్లు పట్టుకునే రకం అని తెలుసు కదా? దాన్నే వ్యగ్యంగా ఎడిట్ చేస్తారన్నమాట…
ఏ “బతుకులు” అని మీ బతుకుల భాష మాట్లాడేదాకా వచ్చింది రా ధాకృష్ణ? నీ “బాబు” ని ఎవరైనా విమర్శిస్తే వెంటనే వాళ్ల “బతుకులు” దాక పోతావా? పత్రిక నడుపుతున్నావా లేక పార్టీ కరపత్రిక నా రా దాకృష్ణ?
ఫేక్ అంట: అక్కడికి నీ పత్రికలో వచ్చేవన్నీ నిజాలన్నట్లు… నీ పత్రిక సర్క్యులేషనే ఫేక్ వార్తలు మీద బ్లాక్మైలింగ్ ల మీద కదా రా దాకృష్ణ ? అసలు ఇవాళ్టి పేపర్ చూస్తేనే అందులో ముప్పావు వంతు ఫేక్ వంటకాలుంటాయి. అంతెందుకు బాబు షా కలసినట్లు ముచ్చట్లు పెట్టినట్టు ఫస్ట్ పేజీ లాస్ట్ లో రాసిందే పెద్ద ఫేక్ కదా రా దాకృష్ణ? వాళ్లు నిజంగా కలిస్తే బాబు నీకు వాట్సాప్ లో సెకన్ల వ్యవధిలోనే పంపుంటాడు గా?
సోషల్ మీడియా మీద పడి ఏడుస్తావు ఏంట్రా దాకృష్ణ? బాగా భయపెడుతున్నట్లున్నారు గా?