దుష్టచతుష్టయం నోరు పారేసుకుంటోంది. ఊరూరా తిరుగుతూ అబద్ధాలు చెబుతోంది. వాళ్ల నాయకుడు కుట్రలు చేస్తూ కుర్చీ ఎక్కబోయేది నేననంటూ విర్రవీగుతున్నాడు. ఈ సమయంలో ఎన్నికల రణరంగంలోకి రియల్ హీరో ప్రవేశించి సమర శంఖం పూరించాడు. తన బలగాన్ని సిద్ధం కావాలని ఆదేశించాడు. భీమిలి నియోజకవర్గం సంగివలస శుక్రవారం రాజన్న తనయుడి నామస్మరణతో మార్మోగింది. అశేష అభిమానగణం నడుమ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగం ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.
అభిమన్యుడు కాదంటూ..
సభలో జగన్ మాటలు ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్తలో కొత్త ఉత్తేజాన్ని నింపాయి. కౌరవుల పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు అంటూ జగన్మోహనుడు తనదైన శైలిలో ప్రసగించి హుషారెత్తించారు. ఈ అర్జునుడికి కృష్ణుడు లాంటి ప్రజలు తోడుగా ఉన్నారని తన ధైర్యాన్ని ప్రదర్శించారు. ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే. మరో 25 సంవత్సరాలపాటు మన జైత్రయాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు స్పష్టంగా తన ప్రణాళికను చెప్పారు. ఎన్నికల హామీల్లో 99 శాతం నెరవేర్చాం. బాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్తపుత్రుడిని వెంటే వేసుకుని తిరుగుతున్నాడు. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు కూడా లేరంటూ ఎండగట్టారు. చేసిన మంచిని నమ్ముకుని మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడని ప్రజల ఆశీర్వాదాలు కోరారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం కల్పించడం, సంక్షేమ పథకాలు, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, దిశ యాప్, వైద్య రంగంలో కొత్త నియామకాలు, విద్యావ్యస్థలో విప్లవాత్మక మార్పులు, బడుగు, బలహీన వర్గాలకు చేకూర్చిన లబ్ధి, ఇచ్చిన పదువులు తదితర వాటి గురించి చెప్పారు. 14 సంవత్సరాల పాలనలో చంద్రబాబు ప్రజలకు ఏనాడూ మంచి చేయలేదన్నారు. 75 రోజుల్లో ఎన్నికలు.. ఇది నిజానికి, అబద్ధానికి మధ్య జరుగుతున్న యుద్ధమని అభివర్ణించారు.
ఇటీవల ఇండియాటుడే నిర్వహించిన కార్యక్రమంలో జగన్ పాల్గొని మాట్లాడారు. దీనిని ఎల్లో మీడియా వక్రీకరించింది. ఆయన చేతులెత్తేశారని రాసి పైశాచిక ఆనందం పొందింది. చంద్రబాబు, లోకేశ్, పవన్ ఆ రాతల్ని చూసి మురిసిపోయారు. ఈరోజు రియల్ హీరో జగన్ చేసిన ప్రసంగం వారికి నిద్ర లేకుండా చేయడం ఖాయం. ఎందుకంటే యుద్ధ క్షేత్రంలో అర్జునుడు ఏమి చేయగలడో దుష్టచతుష్టయానికి బాగా తెలుసు. సీఎం నేను సిద్ధమంటున్నారు.. మరి మీరు సిద్ధమేనా ఎల్లో గ్యాంగ్..