ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ కంచుకోట వైసీపీ పుట్టిన తరువాత ఇప్పటి వరకు గెలవని నియోజకవర్గం అయిన మండపేట లో ఒకేసారి 800 మంది వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీ పార్టీ గెలుపుకు కృషి చేస్తాము అని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థ ను అవహేళన చెయ్యడంతో మొదలైన రాజీనామాలు ఈరోజు వరకు వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశే వరకూ వెళ్ళింది , చూస్తుంటే ఈ రాజీనామా పరంపర ఇప్పటిలో ఆగేలా లేదు.
మండపేట నియోజకవర్గం అంటే టీడీపీ కంచుకోట , ఇక్కడ ఇప్పటి వరకు వైసీపీ గెలవలేదు అలాంటి చోట తోట త్రిమూర్తుల్ని వైసీపీ ఇంచార్జీ గా నియమించడం తోనే టీడీపీ కూసాలు కదలడం మొదలయింది. ఇప్పటికే మొట్టమొదటి సారి మండపేట మున్సిపాలిటీలో టీడీపీ కాకుండా వైసీపీ గెలుచుకుంది. అంతటితో ఆగకుండా మండపేట లో మెజారిటీ సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ లు గెలుచుకొని ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల కదనరంగం లోకి దిగి మొదటి సరి మండపేటలో వైసీపీ జెండా ఎగరెయ్యడానికి సిద్ధంగా వుంది.
అదే సమయంలో టీడీపీనీ చూసుకుంటే కూటమి పేరుతో జతకట్టి పోటీలోకి దిగారు, ఇక్కడ జన సేన లో లీలకృష్ణ కు టికెట్ కేటాయించాక పోవడంతో మొదలైంది రచ్చ , ఇక్కడ మండపేటలో 60% గ్రామాల్లో టీడీపీ, జన సేన మధ్య ప్రత్యక్ష గొడవలు వున్నాయి. అలాంటివి దాటుకొని ఎలక్షన్ ఎలా చేస్తారో చూడాలి. ఇక టీడీపీ తరుపున వరుసగా మూడు సార్లు గెలిచి నాలుగో సారి పోటీ చేస్తున్న జోగేశ్వరరావు మీద నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మూడు సార్లు గెలిచిన నియోజకవర్గం లో ఎలాంటి అభివృద్ధి పనులు చెయ్యలేదు. ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పూర్తి వ్యతిరేకత మూట గట్టుకున్నారు. చంద్రబాబు మండపేటలో మీటింగ్ పెట్టిన సమయంలో టీడీపీలోని ముఖ్య నాయకులు అందరు జోగేశ్వరరావుకు ఎంఎల్ఏ గా అవకాశం ఇవ్వవద్ధు అని కోరారు. కానీ దానిని చంద్రబాబు నాయుడు లెక్క లోకి తీసుకోలేదు ఇది ఇక్కడి నాయకుల మనస్సులను గాయపరిచింది.
ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే ఈసారి మండపేటలో వైసీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.