రాష్ట్రములో ఉన్న కులజాఢ్యానికి కేంద్రబిందువు , కనీసం ఇల్లు అద్దెకు కావాలంటే కులపరీక్షకు నిలవాల్సిన ప్రాంతం, కులాధిపత్యానికి అడ్డువస్తున్నారని ప్రత్యర్థి కులం నాయకుడి పై ప్రభుత్వ ముఖ్యల ప్రణాళికలతో మారణహోమం సాగించిన ప్రాంతం, పైన అమ్మవారు, కింద .. వారు అని ఇతర వర్గాల ప్రజలంటే లెక్కలేకుండా గర్వంగా చెప్పుకొనే ప్రాంతం అదే.. అదే విజయవాడ .
అక్కడి నడిబొడ్డున 206 అడుగుల నిలువెత్తు బడుగు బలహీనుల ఆరాధ్యదైవమే కాదు దేశానికి ప్రజాస్వామ్య బాటలను, ప్రజలకు మానవ హక్కులను, ప్రాథమిక హక్కులను అందించిన మహా మనిషి, కుల వివక్షకు నిప్పెట్టిన అఖండజ్యోతి డా: బిఆర్ .అంబెడ్కర్ నిలువెత్తు విగ్రహముతో పాటు మ్యూజియం , ఆయన్ను స్ఫూర్తిగా చూపే చిత్ర ప్రదర్శనశాల, పార్కు, విద్యుద్దీపాలంకరణలతో కూడిన ప్రాజెక్టును ప్రజలెన్నుకున్న ప్రభుత్వం మొదలు పెట్టి పూర్తి చేసి ఆ ప్రభుత్వనేత ప్రారంభించబోతే నీకు ఆ విగ్రహాన్ని తాకే అర్హతే లేదని ఆ ప్రాంత కులతత్వవేత్త, రాజగురువు ఆధ్వర్యములోని ఈనాడు పత్రిక వికటాట్టహాసం చేసే సాహసానికి వొడిగట్టడం వారిలోని ఫక్తు ఫ్యూడలిస్టిక్ భావజాలాన్ని, అంబేద్కరిజానికి పుట్టు వ్యతిరేకతను, ప్రజాస్వామ్యం పట్ల అసహనాన్ని సూచిస్తుంది .
స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్ళైనా, రాజ్యాంగం రూపొంది 73 ఏళ్ళైనా ఇంకా ఇలాంటి ఫ్యూడలిస్టిక్ భావజాలాన్ని వెళ్లగక్కడానికి వెనకాడని తెంపరితనాన్ని ఎలా చూడాలి ?
ఇలాంటి వ్యక్తుల చేతిలో మీడియా ఉండటం, అలాంటి వాళ్ళు మరికొందరితో కలిసి తమ వాడే ఈ రాష్ట్ర ప్రజలను ఏలాలనుకోవటం, అక్కడ వేరే ఎవరున్నా అర్హులు కారన్నట్లు ప్రవర్తించటం విజ్ఞత కలిగిన ఈ రాష్ట్ర ప్రజలకెరుకే.
ఇలాంటి భావజాలం ఉన్న వారితో కూడుకున్న ప్రభుత్వం వస్తే వారిచ్చే పాలన ఎలా ఉంటుందంటే .. ప్రజలందరి ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన, భావించాల్సిన దానిని కేవలం తమ ప్రైవేట్ ఎస్టేట్ గా చేసుకోవాలనుకొనేంతగా , అక్కడ ఇప్పటి ప్రభుత్వం బలహీన వర్గాలకు ఆవాస స్థలాలు ఇవ్వబోతే తమ వంటి ఉన్నతులకే గానే అట్టి అల్పులకు స్థానమేందుకు అని కోర్టుకు పోయి అడ్డుకొనేంతగా, రాష్ట్ర ఇతర ప్రాంతాలకు కనీస స్థాయి సమ ప్రాతినిధ్యం లేకుండా హై కోర్టుతో సహా అన్నీ, అంతా అక్కడే .. అదే అమరావతి.., అది మా వంటి దేవతలకై రాజధాని అని భావించేంతగా…
తాము ప్రజాస్వామ్యములో ఉన్నామని తమకు అధికారం దక్కాలంటే ప్రజలందరి ఆశీస్సులు, భాగస్వామ్యం ఉండాలన్న కనీస స్ప్రుహను కోల్పోయి అధికారాన్ని కొన్ని దశాబ్దాలుగా చేపట్టి రాష్ట్ర వనరులను, ప్రజల కష్టాన్ని దోచి వ్యవస్థలను చెరబట్టి తాము దేనినైనా, ఎవ్వరినైనా మాకు కావాల్సిన విధంగా లొంగదీసుకుంటామని, ప్రజలనుండి దోచిన సంపదతో తలకెక్కిన పొగరుతో వ్యవహరిస్తుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారు.
ఇలాంటి పొగరుబోతులకు అస్సలు రుచించని తమ బద్ధ వ్యతిరేకి ఐన ఒక నాయకుడు వచ్చి తమ భావజాలానికి అస్సలు పొసగని ఒక మహా మనిషి విగ్రహాన్ని తాము గర్వన్గా తలచుకొనే తమ కుల రాజధాని నడినెత్తిన పెట్టినట్లు పెట్టడం , వారి దుష్ట మస్తిష్కాలపై అంకుశం దింపినట్లు భావించటం కేవలం వారి మనోవైకల్యఫలమేనని ఎప్పుడు గుర్తిస్తారో కాలమే చెబుతుంది.
ఇప్పుడు బడుల్లో, వీధుల్లో , కళాశాలల్లో , ఉద్యోగ స్థలాల్లో, ఆసుపత్రుల్లో కులవివక్షతకు గురై అవమానాలకు అన్యాయాలకు బలైన ఎందరికో ఆత్మ సంతృప్తిని కల్గించిన ఆ నాయకుడికి ఆ మహా మనిషి విగహావిష్కరణకు ఎందుకు అర్హత ఉండదు ? మెదళ్ళకు కుల పొరలు కమ్మిన అజ్ఞానవంతులకు ఎరుకకు రాదు.. కానీ ఈ రాష్ట్రప్రజలకు ఎరుకే.