కొన్ని ఆలోచనలు కొన్ని సందర్భాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. అంతకుమించి హాస్యాస్పదంగానూ ఉంటాయి. అలాంటి ఒక గమ్మత్తైన వింతైన అంశం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం.. సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీకి ఒక గుర్తు దానికి ఒక పేరు ఉంటుంది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడానూ… ఆక్రమంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలకి సంబంధించి నాలుగు గుర్తులున్నాయి. ఇక్కడ ఆ గుర్తులు మధ్య ఉన్నటువంటి గమ్మత్తైన విషయం ఏంటో చూద్దాం…
పైన చెప్పుకున్నట్లుగానే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు, తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి కమలం గుర్తు, జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తులు గా ఉన్నాయి. అయితే ప్రస్తుతం జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ని ఫ్రీ సింబల్ జాబితాలోకి చేర్చారు అనుకోండి అది వేరే విషయం… దాన్ని కాసేపు పక్కన పెడితే ఈ రాజకీయ పార్టీల గుర్తులు, వాటి పేర్లలో గమ్మత్తేంటి అనుకుంటున్నారా… అక్కడికే వస్తున్నా ఆగండి.
ఏ పార్టీకి ఏ గుర్తు ఉన్నప్పటికీ ప్రతి గుర్తుకు తెలుగులో ఒక పేరు ఉంటుంది. వైసిపి గుర్తు ఫ్యాన్ ని తెలుగులో పంఖా అంటారు. అలాగే బిజెపి గుర్తు లోటస్ ని కమలం అంటారు. తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ ని తెలుగులో ఏమంటారో టక్కున చెప్పగలరా? అలాగే జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును కూడా తెలుగులో ఏమంటారో తడుముకోకుండా చెప్పగలరా? అందుకే చెప్పాను ఇదొక వింతైన గమ్మత్తయిన హాస్యాస్పదమైన విషయము అని… పేరుకు మాత్రమే తెలుగుదేశం పార్టీ గుర్తుకు మాత్రం తెలుగులో పేరు లేదు.. దాని తోక పార్టీ జనసేన గుర్తుకైతే తల తోకా లేదు..