మధ్యప్రదేశ్లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో నేటి ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 14 మంది పూజారులకు గాయాలైనట్లు సమాచారం. గాయపడినవారిలో ప్రధాన అర్చకుడు సంజయ్ గౌర్ సహా పలువురు ఉన్నారని అధికారులు వెల్లడించారు. హోలీ పర్వదినం సందర్భంగా గర్భగృహంలో భస్మహారతి కార్యక్రమం జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భస్మ హారతి జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగడంతో ఓ వస్త్రం అంటుకొని పూజారులు, భక్తులపై పడటంతో […]