స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 విడుదలకు సిద్ధంగా ఉంది. 1996 లో వచ్చిన భారతీయుడుకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంపై ప్రేక్షకులకు మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న భారతీయుడు 2 విడుదల తేదీని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తుంది. భారతీయుడు 2కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు శంకర్ అభ్యర్ధన మేరకు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడని తెలుస్తుంది. మరోవైపు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్ నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా రామ్ చరణ్ వాయిస్ ఓవర్ విషయంలో చిత్ర యూనిట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
కాగా చాలా సార్లు షూటింగ్ వాయిదా పడుతూ వచ్చిన భారతీయుడు 2 చిత్రం ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇందులో కాజల్,రకుల్ ప్రీత్ సింగ్ ,సిద్దార్థ్, ఎస్.జె.సూర్య ,బాబీ సింహ ,మధుబాల వంటి తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ & రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.