2024-25 విద్యా సంవత్సరంలో బోధన ప్రమాణాలు మరింత పెరగాలని వాటికి అనుగుణంగా వచ్చే వేసవి సెలవులను ఉపయోగించుకోవాలని విద్యాశాఖ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఉపాధ్యాయులకు సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో విదేశాలతో పోటీపడే విద్య వ్యవస్థని తీసుకొచ్చామని దానికి అనుగుణంగా ఉపాధ్యాయులకి ప్రభుత్వం శిక్షణ ఇస్తున్నప్పటికీ ఉపాధ్యాయులు మరింత సమయం కేటాయించి వివిధ మార్గాల ద్వారా పాఠ్యాంశాలపై లోతైన శోధన చేసి సిద్ధమవ్వాలని కోరారు. ఈ నెల 23న 2023 2024 విద్యా సంవత్సరం ముగియడం, కొత్త […]
ప్రవీణ్ ప్రకాష్. ఈయన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. సీఎం ఆలోచనలకు తగినట్లుగా ప్రవీణ్ పనిచేస్తూ ఆ శాఖలో తనదైనముద్ర వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం బడులను సందర్శిస్తూ.. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరాయా? లేదా? ఆరాతీసే కార్యక్రమాన్ని కొంతకాలం నిర్వహించారు. విద్యార్థుల విషయంలో రాజీ పడకుండా వారికి అన్ని వసతులు కల్పించడంలో విజయవంతమయ్యారు. దీంతో ఆయన్ను అందరూ అభిమానిస్తారు. […]