చంద్రబాబు హయాంలో రోడ్ల నిర్వహణను నిర్వహణను నిర్లక్ష్యం చేసి ఆధ్వాన్నంగా మార్చిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. ఆఖరికి రోడ్ల పునరుద్ధరణ కోసం 2017 – 18లో తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని కూడా ఎన్నికల ప్రయోజనాల కోసం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించిన చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు తమ ఓట్లతో బుద్ధి చెప్పారు. కాగా ఎన్నికల అనంతరం కోవిడ్ మహమ్మారి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టినా రోడ్ల అభివృద్ధిపై జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అవసరమైన చోట రోడ్లకు మరమ్మతులు చేస్తూ నూతన రహదారులను నిర్మిస్తూ తన చిత్తశుద్ధిని ప్రదర్శించింది. కానీ ఇవేమి పట్టనట్లు రాష్ట్ర రహదారులపై రంధ్రాన్వేషణ చేస్తూ ఎల్లో మీడియా ఎప్పటికప్పుడు విషం చిమ్ముతూనే ఉంది.ఎల్లో మీడియా ప్రచురించని వాస్తవాలను పరిశీలిస్తే ప్రజలను ఏ విధంగా మభ్య పెడుతున్నారో అర్ధం అవుతుంది.
చంద్రబాబు హయాంలో రోడ్ల నిర్మాణం, నిర్వహణకు చేసిన మొత్తం ఖర్చు రూ.24,792 కోట్లు కాగా దానికి రెట్టింపు స్థాయిలో రూ.42,236 కోట్ల జగన్ సర్కారు వెచ్చించడం గమనార్హం. రోడ్ల మరమ్మతులకు బాబు హయాంలోరూ.2,954 కోట్లను వెచ్చించగా జగన్ ప్రభుత్వం రూ.4,149 కోట్ల రూపాయలను రోడ్ల మరమ్మతుల కోసం ఖర్చు చేసింది. రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం రూ.4,325 కోట్లను ఖర్చు చేయగా జగన్ ప్రభుత్వంలో రూ.7,340 కోట్ల వ్యయంతో రహదారులను నిర్మించింది. పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి బాబు హయాంలో రూ.3,160 కోట్లను వెచ్చిస్తే, జగన్ ప్రభుత్వం రూ.5,444 కోట్లను వెచ్చించి కొత్త రోడ్లను నిర్మించింది. జాతీయ రహదారుల నిర్మాణానికి బాబు హయాంలో రూ.14,353 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ సర్కారు రూ.25,304 కోట్లు వెచ్చించింది.
వాస్తవాలు ఇలా ఉంటే ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తూ అసత్య కథనాలను వండి వార్చి, ప్రభుత్వంపై బురదజల్లడమే పెట్టుకున్న ఎల్లో మీడియా ప్రజల్లో కలవరాన్ని కలిగించే కథనాలను ప్రచురించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. ఓ పార్టీ కరపత్రంగా మారి మరీ ప్రభుత్వ వ్యతిరేక కథనాలను వండి వారుస్తున్న ఎల్లో మీడియాకి ప్రజలు బుద్ది చెప్పే రోజు త్వరలోనే వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.