లోకేష్ తెలుగు పాండిత్యం గురించి లోకం మొత్తం తెలిసిందే, అతని భాషతో, ప్రాంతాల పేర్లని, చారిత్రిక ప్రదేశాల పేర్లని చిత్ర విచిత్రంగా మార్చి పలుకుతూ తెలుగుని హత్య చేస్తుంటాడు . అయితే లోకేష్ కి తెలుగు భాష అబ్బకపోవటమే కాదు, తెలుగు రాష్ట్రల్లో వివిధ వర్గాలకి చెందిన ప్రజలు నిర్వహించుకొనే పండుగలు, వేడుకలు, జయంతి, వర్ధంతులకు తేడా తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడి అభాసుపాలు కావడం, ఆయా వర్గాల చేత తిట్టించుకోవడం పరిపాటిగా మారింది. అలా గతంలో ఒక నాయకుని వర్ధంతికి శుభాకాంక్షలు చెప్పి తిట్టించుకొన్న ఘనుడు లోకేష్ . అయినా లోకేష్ తీరు మారలేదు. ఈ సారి క్రిష్టియన్స్ కి అత్యంత ముఖ్యమైన గుడ్ ఫ్రైడే పై ఏ మాత్రం అవగాహన లేకుండా ట్విట్టర్ వేదికగా కామెంట్ చేసి తన నోటి దురదని మరోమారు నిరూపించుకొన్నాడు లోకేష్.
జీసస్ తన జీవితాన్ని త్యాగం చేసి పరలోకానికి తరలిన విషాద దినమైన గుడ్ ఫ్రైడే సందర్బంగా శుభాకాంక్షలు చెబుతూ గొప్ప వేడుకగా చేసుకోమని ట్విట్టర్ వేదికగా సందేశాన్ని అందించాడు లోకేష్.
నిజానికి సర్వ మానవాళి పాప విమోచన కోసం జీసస్ తనని తాను బలి యాగం చేసుకొన్న గుడ్ ఫ్రైడే నాడు జీసస్ ని నమ్మే క్రిష్టియన్స్ ఆ రోజు ఉపవాసం ఉండి ప్రభువు కోసం ప్రార్ధనలు చేస్తారు. లేనివారికి ప్రభువు పేరిట దానధర్మ కార్యక్రమాలు చేస్తారు.
అలాంటి విషాదకర పవిత్ర శుక్రవారం రోజుని వేడుకగా చేసుకోమని ఉచిత సలహా ఇవ్వటం అమాయకత్వమో, బలుపో తెలీదు కానీ క్రిష్టియన్ సమాజ విశ్వాసాలను గురించి తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా ట్వీట్ చేయటం మాత్రం క్రైస్తవ సమాజాన్ని, వారి విశ్వాసాలని అవమానించడమేనని చెప్పొచ్చు.