తమిళ నటుడు విజయ్ ఆంటోనీ ఇటీవల నటించిన చిత్రం లవ్ గురు. వినాయకన్ వైద్యనాథన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించిన ఈ చిత్రంలో మృణాళిని రవి హీరోయిన్ గా నటించింది. విజయ్ ఆంటోని నటించిన మొదటి రొమాంటిక్ డ్రామా ఇదే కావడం విశేషం. కాగా ఈ చిత్రానికి భరత్ ధనశేఖర్, రవి రోయ్స్టర్ సంగీతం అందించారు. వీటీవీ గణేశ్, యోగిబాబు, ఇళవరసు, తలైవాసల్ విజయ్ మరియు సుధ ముఖ్య పాత్రలలో నటించిన లవ్ గురు […]
దిగ్గజ దర్శకుడు మణిరత్నం, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్లో గతంలో నాయకుడు లాంటి బ్లాక్స్ బస్టర్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వారిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం థగ్ లైఫ్.. దీంతో ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ పై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ లు నిర్మిస్తున ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో జయంరవి, దుల్కర్ సల్మాన్ లు నటిస్తున్న విషయం […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్య కావ్యం RRR.. మార్చి 25, 2022 న థియేటర్లలో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును కూడా కొల్లగొట్టింది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల ప్రశంసలు పొందిన RRR మరోసారి థియేటర్లలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది. ఈ సినిమాతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్స్ గా ఎదిగారు.. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ చేసిన […]
విశాల్, హరి కాంబినేషన్లో తెరకెక్కిన మూడో చిత్రం రత్నం.. ఏప్రిల్ 26న తెలుగు తమిళ భాషల్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అప్పుడే ఓటీటీ గడప తొక్కనుందనే వార్తలు వస్తున్నాయి.. విశాల్ సరసన ప్రియ భవాని శంకర్ నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ దక్కలేదు. దాంతో కేవలం నెలలోపే ఓటీటీలోకి ఈ సినిమా రానుందని ప్రచారం జరుగుతోంది. హరి, విశాల్ కాంబినేషన్లో గతంలో భరణి, పూజ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. దాంతో రత్నం మూవీపై […]
ప్రతీ వారం ఓటీటీలో సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. అలాగే ఈ వారం కూడా పలు సిరీస్ లు, సినిమాలు మొత్తం కలిపి 21 ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఆవేశం, ది గోట్ లైఫ్ తెలుగులో రానున్నాయి. ఏయే ప్లాట్ఫామ్ లో ఏ సినిమా/సిరీస్ విడులా అవుతుందో పరిశీలిస్తే.. అమెజాన్ ప్రైమ్: ఆవేశం (తెలుగు డబ్బింగ్ చిత్రం) – మే 9 మ్యాక్స్టన్ హాల్ (జర్మనీ వెబ్ సిరీస్)-మే 9 ది […]
తమిళ నటుడు ధనుష్ వరుసగా తెలుగు దర్శకులకు అవకాశమిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ సినిమా చేసి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ధనుష్, ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ధనుష్ మరో తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే ధనుష్ తెలుగు దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు […]
అంజలి కెరీర్ లో 50 వ చిత్రంగా వచ్చిన గీతాంజలి మళ్ళీ వచ్చింది ప్రేక్షకాదరణ పొందడంలో విఫలమైంది. పదేళ్ల క్రితం అనగా 2014లో రూపొందిన గీతాంజలికి సీక్వెల్ గా రూపొందిన ఈ హారర్ కామెడీ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య కీలక పాత్రల్లో నటించారు. కోన వెంకట్, ఎంవివి సత్యన్నారాయణ నిర్మించిన ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహించగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. ఈ చిత్రం ఈనెల 10న అమెజాన్ […]
చాలాకాలంగా హిట్ లేని మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా శివుడిగా ప్రభాస్ నటిస్తాడని ప్రచారం జరిగినా చివరకు శివుడి పాత్రను అక్షయ్ కుమార్ పోషించినట్లు సమాచారం. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ఓఎంజి2 లో శివుడి పాత్రను […]
240 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి మలయాళంలో అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టిన చిత్రంగా రికార్డ్ సృష్టించిన సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్ ఎట్టకేలకు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి రాబోతోందా అని సినీ ప్రియులు ఎదురుచూస్తూ వచ్చారు. వారి నిరీక్షణకు తెరదించుతూ మే 5 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ […]
శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో నటించిన గీతాంజలి చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన గీతాంజలి మళ్ళీ వచ్చింది ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. కోన వెంకట్, ఎంవివి సత్యన్నారాయణ నిర్మించిన ఈ చిత్రంలో అంజలితో పాటు శ్రీనివాస రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. కానీ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన ఈ చిత్రం ఓటిటిలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం మే 10 […]