దిగ్గజ దర్శకుడు మణిరత్నం, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్లో గతంలో నాయకుడు లాంటి బ్లాక్స్ బస్టర్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వారిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం థగ్ లైఫ్.. దీంతో ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ పై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ లు నిర్మిస్తున ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
కాగా ఈ చిత్రంలో జయంరవి, దుల్కర్ సల్మాన్ లు నటిస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా మరో థగ్ రాబోతున్నాడంటూ చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఆ థగ్ మరెవరో కాదు శింబు.. ఓ ఇంట్రో వీడియోతో శింబు థగ్ లైఫ్ లో నటిస్తున్నాడని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కమల్ హాసన్ సరసన త్రిష నటిస్తుంది. థగ్ లైఫ్ లో నటించే వారంతా గతంలో మణిరత్నం చిత్రాల్లో నటించిన వారే కావడం విశేషం. కమల్ హాసన్ నాయకుడులో, జయం రవి, త్రిష పొన్నియన్ సెల్వన్ లో , దుల్కర్ సల్మాన్ ఓకె బంగారంలో, శింబు నవాబ్ లో మణిరత్నం దర్శకత్వంలో నటించారు. వీరంతా మరోసారి మణిరత్నంతో జట్టు కట్టారు.
కాగా విక్రమ్ లాంటి సాలిడ్ హిట్ తరువాత కమల్ హాసన్ నటిస్తున్న చిత్రం కావడం, నాయకుడు తర్వాత మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ మరోసారి నటిస్తూ ఉండడం, కథ కూడా కమల్ హాసన్ అందించడంలాంటి పలు కారణాల వల్ల విక్రమ్ పై అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ చిత్రం అంచనాలను అందుకుంటుందో లేదో వేచి చూడాలి.