దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్య కావ్యం RRR.. మార్చి 25, 2022 న థియేటర్లలో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును కూడా కొల్లగొట్టింది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల ప్రశంసలు పొందిన RRR మరోసారి థియేటర్లలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది.
ఈ సినిమాతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్స్ గా ఎదిగారు.. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ చేసిన నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. హాలీవుడ్ బడా డైరెక్టర్స్ జేమ్స్ కామెరూన్, స్టీఫెన్ స్పీల్ బర్గ్ లు సైతం RRR చిత్రాన్ని ప్రశంసించారు. ముఖ్యంగా నాటు నాటు పాట వరల్డ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు.
కాగా ఈ చిత్రం ఈ నెల అనగా మే నెల 10 న రీ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. RRR చిత్రం 2డి, మరియు 3డి ఫార్మాట్లలో హిందీ & తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే 1300 కోట్ల కు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ మూవీ మరిన్ని కలెక్షన్స్ కొల్లగొట్టబోతుందో అని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు. మే 10న RRR చేసే సంచలనాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో వేచి చూడాలి..