చెప్పేది కొండంత, చేసేది గోరంత అన్న బాబు వైఖరినే, ఆయన సతీమణి భువనేశ్వరి గారు కూడా అనుసరిస్తున్నారు. ఎప్పుడో విప్లవాత్మకంగా యన్టీఆర్ ప్రవేశపెట్టిన కేజీ రెండు రూపాయల బియ్యంతో… బాబు తూతూ మంత్రంగా మొదలుపెట్టిన అన్నా క్యాంటీన్లను పోలుస్తూ.. తండ్రిని మించిన యుగపురుషుడిగా భర్తను చూపించడానికి తాపత్రయపడుతున్నారు. “పేదవాడికి మూడుపూటలా తక్కువ ఖర్చుతో అన్నం దొరకాలనే ఉద్దేశంతో చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రవేశపెట్టారని, వాటిని జగన్ మూసివేయించినా టీడీపీ కార్యకర్తలు పెద్దమనసుతో నడిపిస్తున్నారని…” కుప్పం నిజం గెలవాలి […]
అన్న క్యాంటీన్ : టీడీపీ పార్టీ 2014 మ్యానిఫెస్టోలో ఓ ప్రతిష్టాత్మక పధకం . అధికారంలోకొచ్చి నాలుగేళ్లు గడిచే వరకు ఆ ఊసే ఎత్తకుండా అటకెక్కించి ఎన్నికలు దగ్గరికొచ్చే సమయంలో హఠాత్తుగా గుర్తు తెచ్చుకున్న పధకం . ఇన్నాళ్లు పట్టని సామాన్యుని ఆకలి ఘోష ఈ చివరి రోజుల్లో ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడుకోవటానికి గుర్తు తెచ్చుకొని హడావుడిగా ప్రారంభించిన పధకం . సరే చివరి రోజుల్లో అయినా సామాన్యుని ఆకలి తీరే ఓ మంచి పధకం […]