అన్న క్యాంటీన్ : టీడీపీ పార్టీ 2014 మ్యానిఫెస్టోలో ఓ ప్రతిష్టాత్మక పధకం . అధికారంలోకొచ్చి నాలుగేళ్లు గడిచే వరకు ఆ ఊసే ఎత్తకుండా అటకెక్కించి ఎన్నికలు దగ్గరికొచ్చే సమయంలో హఠాత్తుగా గుర్తు తెచ్చుకున్న పధకం . ఇన్నాళ్లు పట్టని సామాన్యుని ఆకలి ఘోష ఈ చివరి రోజుల్లో ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడుకోవటానికి గుర్తు తెచ్చుకొని హడావుడిగా ప్రారంభించిన పధకం .
సరే చివరి రోజుల్లో అయినా సామాన్యుని ఆకలి తీరే ఓ మంచి పధకం ప్రారంభించారు అని సంతోషించాలో ఆకలి గొన్న అభాగ్యులకు కేటాయించిన సొమ్ములో కూడా అరవై ఆరు పైసలు వంతు అగ్రభాగం మింగిన టీడీపీ పార్టీ నేతల్ని , కాంట్రాక్టర్లని చూసి ఏడవాలో అర్థం కాని దుస్థితి
ఎన్నికలకు ఏడాది గడువుండగా హడావుడిగా ఏర్పాటు చేసిన ఈ అన్న క్యాంటీన్ల నిర్మాణంలో ఆ పార్టీకి చెందిన నాయకులు కోట్లు దండుకున్నారు. పేదలకు నాణ్యమైన భోజనం అందిస్తామంటూ ఇష్టారాజ్యంగా కమీషన్లు భోంచేశారు. 203 క్యాంటీన్ల నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం 76.22 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఏకంగా 53.33 కోట్లు పక్కదారి పట్టాయి. క్యాంటీన్ల నిర్మాణంలో 35.11 కోట్లు, అందులో హంగుల పేరిట 18.22 కోట్లు కాజేసినారు. అన్న క్యాంటీన్ల నిర్మాణాల్లో ప్రతి అంగుళంలోనూ అవినీతి తాడవించింది.
కట్టిన కొద్ది వారాలకే ఒంగోలులోని అన్నా కాంటీన్ కుంగిపోగా, అనంతపురం జిల్లా హిందూపురంలోని ఒక అన్నా క్యాంటీన్లో వ్యభిచార బాగోతం అందరు చూశారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అన్నా క్యాంటీన్లో రాత్రి వేళల్లో టీడీపీ వాళ్ళ వ్యభిచార భాగోతం అన్ని టీవీ ఛానెల్స్ లో రావడం విదితమే. ఇహ నరసరావుపేటలోని ఒక అన్నా కాంటీన్ లో జరిగిన అవినీతి భాగోతం న భూతో న భవిష్యత్ అని చెప్పొచ్చు. పేటలోని స్టేడియం వద్ద గల అన్న కాంటీన్ కి వచ్చే భోజనాలు మొత్తం నాటి స్పీకర్ కోడెలకి చెందిన సేఫ్ ఫార్మాకి తరలించి అందులోని ఉద్యోగస్తులకు తక్కువ జీతం వారికీ 20 రూపాయలకు, ఎక్కువ జీతం వారికీ నలభై రూపాయల లెక్కన అమ్ముకొన్న విషయం విదితమే.
ఈ అవినీతి అక్రమాల గురించి ప్రస్తావన వచ్చినా, అవినీతి పై విచారణ జరిగే సమయం వచ్చిందని అనుమానం కలిగినా వెంటనే పేదలకు పెట్టే అన్నం పైన విషం చీమ్ముతున్నారు, అన్నా కాంటీన్ లు అమృత కలసాలు, బాబు గారు అన్నదాత అంటూ ఎల్లో మీడియాలో ఏడుపులు కనపడడం సర్వ సాధారణం అయిపోయింది.
అందులో భాగమే ఈ రోజు ఆంధ్రజ్యోతిలో అన్నా క్యాంటిన్ల అంశంతో ఏడుపుగొట్టు చర్చ