నేడు ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మరో కీలక మ్యాచ్ జరగనుంది కోల్కతా
ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ ఆరు మ్యాచ్ లు ఆడగా 5 మ్యాచ్ లు గెలిచి 1 ఓటమితో టేబుల్ టాప్ లో కొనసాగుతుండగా,కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 5 మ్యాచ్ లు ఆడి నాలుగింట గెలిచి ఒక మ్యాచ్ లో ఓటమి పాలైంది, ఈరోజు జరిగే మ్యాచ్ లో గెలిచి టేబుల్ టాప్ లోకి వెళ్లాలని నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు భావిస్తుంది
రెండు జట్లు బలాబలాలు చుస్తే రెండూ కూడా సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి, గెలుపు విషయంలో నువ్వా నేనా అనే రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తుంది , ఈడెన్ గార్డెన్స్ సొంత పిచ్ కావడం కోల్కతాకు కలిసొచ్చే అంశం.
ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 27 మ్యాచ్ ల్లో తలపడగా 14 సార్లు కోల్కతా గెలవగా , 13 సార్లు రాజస్థాన్ రాయల్స్ గెలిచింది, పిచ్ కండిషన్ ల బట్టి టాస్ ఎవరు గెలిచిన మొదటగా బౌలింగ్ తీసుకుంటారు