ఐపీఎల్ 2024 లో భాగంగా కోల్కత్తా నైట్ రైడర్స్,సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్‌లో కోల్కత్తా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది, దీంతో ఆ జట్టు ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ లో అడుగుపెట్టింది
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కు బ్యాటింగ్‌లో శుభారంభం లభించలేదు . టాప్ ఆర్డర్ విఫలమవడంతో భారీ లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయింది, హైదరాబాద్ జట్టు 19.3 ఓవర్లలో కేవలం 159 పరుగులకు ఆల్ అవుట్ అయింది ,రాహుల్ త్రిపాఠి (35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 55) హాఫ్ సెంచరీతో రాణించగా.. హెన్రీచ్ క్లాసెన్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32), ప్యాట్ కమిన్స్(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్కత్తా నైట్ రైడర్స్ .. 13.4 ఓవర్లలో 2 వికెట్లకు 164 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది, వెంకటేశ్ అయ్యర్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 పరుగులు నాటౌట్), శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58 పరుగులు నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్, కమిన్స్ తలో వికెట్ తీసారు.
ఈ ఓటమితో తృటిలో ఫైనల్ చేరే అవకాశాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ చేజార్చుకుంది .. శుక్రవారం చెన్నై జరిగే క్వాలిఫయర్-2లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరోవైపు అన్ని విభాగాలలో రాణించిన కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది