ఐపీఎల్ 2024 లో భాగంగా ఈరోజు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్లో ఆర్సీబీ కి ఇది నాల్గవ మ్యాచ్. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచి రెండు ఓడిపోయారు, ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవాలనే ఒత్తిడిలో ఉన్నారు.ఓడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆర్సీబీ ఓటమికి ప్రధాన కారణం బౌలర్లే.
చెన్నై ,పంజాబ్, కేకేఆర్ లపై ఆర్సీబీ బౌలింగ్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. అందువల్ల నేటి మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పు ఉంటుంది. బెంగళూరులోని బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌ల స్వభావాన్ని బట్టి, ఆర్సీబీకి బలమైన, అనుభవజ్ఞుడైన బౌలర్ అవసరం.
వెస్టిండీస్‌కు చెందిన సీమర్ అల్జారీ జోసెఫ్ గత మూడు మ్యాచ్‌ల్లో పేలవమైన ప్రదర్శన వల్ల అతనిని ఈరోజు జట్టు నుంచి తప్పించవచ్చు. అతని స్థానంలో స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ దాదాపుగా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది
అలాగే, ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ విభాగంలో కూడా మార్పు రావాల్సి ఉంది. గత ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నుంచి పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రజత్ పాటిదార్‌కు నేడు అవకాశం దక్కడం అనుమానమే. అతని స్థానంలో సుయేష్ ప్రభుదేశాయ్ లేదా మహిపాల్ లుమ్రూర్ వచ్చే అవకాశం ఉంది.
మరో పక్క గత మ్యాచ్ లో విజయం సాధించిన లక్నో సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది గతంలో బెంగళూరు తరుపున ఆడిన రాహుల్ కి ఈ పిచ్ పై ఉన్న అనుభవం ఆ జట్టుకి కలిసొచ్చే అంశం, అన్ని విభాగాల్లో లక్నో పటిష్టం గా కనిపిస్తుంది, ఏ జట్టు టాస్ గెలిచినా మొదట బౌలింగ్ తీసుకుంటారు
ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా) :
లక్నో సూపర్ జెయింట్స్ :
కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్‌కీపర్), దేవదత్ పడిక్కల్, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహిసిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయేష్ ప్రభుదేశాయ్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, కర్ణ్ శర్మ, లక్కీ ఫెర్గూసన్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్.