ఐపీఎల్ 2024 – 10 వ మ్యాచ్‌లో ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి . చివరి మ్యాచ్‌లో ఆర్సీబీ నాలుగు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందగా, కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగు పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది
ఈ మ్యాచ్ ఆర్సీబీ సొంత గ్రౌండ్ బెంగుళూరు వేదికగా చిన్న స్వామి స్టేడియం లో జరగనుంది. గత మ్యాచ్ లో విజయం సాధించినట్టుగా ఈ మ్యాచ్ లో కూడా గెలవాలని రెండు జట్లు ఉవ్విళూరుతున్నాయి , సొంత గ్రౌండ్ కాబట్టి ఆర్సీబీకి ఫేవర్ గా ఉంటుంది అనుకుంటే పొరపాటే ఎందుకంటే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చాలా బలంగా ఉంది , అందులోను భీకరమైన హిట్టర్ లు ఉన్నారు , గత కేకేఆర్ మ్యాచ్ లో రస్సెల్ ఎలా విధ్వంసం చేసాడో అందరికి తెలిసిందే.
ఇటు బెంగుళూరు జట్టు కూడా పటిష్టంగా కనిపిస్తున్నా కానీ విరాట్ కోహ్లీ తప్ప ఎవరు పెద్దగా రాణించింది లేదు. ముఖ్యంగా ఓవర్సీస్ బ్యాటర్లు డుప్లెసిస్ , మ్యాక్సీ వెల్ , గ్రీన్ ముగ్గురు ఇప్పటివరకు బ్యాటింగ్ లో ఆకట్టుకుంది లేదు, బౌలింగ్ విభాగం కూడా అంతంత మాత్రంగానే ఉంది, రెండు జట్లు బలాబలాలు చూస్తే కోల్‌కతా నైట్ రైడర్స్ అన్ని విభాగాలలో చాలా పటిష్టంగా కనిపిస్తుంది
టాస్ ఎవరు గెలిచినా చిన్న స్టేడియం కాబట్టి ఛేజింగ్ చేయడానికే మొగ్గు చూపుతారు, గతేడాది ఐపీఎల్ లో కోహ్లీ, గంభీర్ ల మధ్య వివాదం ఎంత సంచలనం రేకెత్తించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కేకేఆర్ మెంటార్ గా గంభీర్ వ్యవహరిస్తున్నాడు, కాబట్టి ఈ మ్యాచ్ లోనూ అందరి దృష్టి కోహ్లీ, గంభీర్ లపైనే ఉంటుంది.
ఇరు జట్లు ఇప్పటిదాకా 32 సార్లు తలపడగా . 14 మ్యాచుల్లో ఆర్సీబీ, 18 మ్యాచుల్లో కేకేఆర్ విజయాలు సాధించాయి
ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా) :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్, కెమరూన్ గ్రీన్, రజత్ పాటిదార్, అంజూ రావత్, దినేష్ కార్తీక్, అలీజారి జోసెఫ్,
మయాంక్ దగర్, సిరాజ్, యాష్ దయాల్ ( ఇంపాక్ట్ ప్లేయర్ : మహిపాల్ లంరోరర్ )
కోల్‌కతా నైట్ రైడర్స్ :
శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, నితీష్ రాణా, ఫిల్ సాల్ట్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, సుయాశ్ శర్మ, రింకు సింగ్ , ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా ( ఇంపాక్ట్ ప్లేయర్ : రమణదీప్ సింగ్ )