ఐపీఎల్-2024 నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బుధవారం సొంత మైదానం ఉప్పల్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పోరాడి ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. సొంతగడ్డపై ముంబాయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విజృంభించారు. ఒక్కరు ఇద్దరు అని కాకుండా వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగిపోయారు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.
ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం గతంలో రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు నమోదు చేసిన 263 రన్స్ ను అధిగమించి సరికొత్త చరిత్రను సృష్టించారు.ఈ సీజన్‌తో టోర్నీలోకి అడుగుపెట్టిన ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ రెచ్చిపోయాడు. బౌలర్ ఎవరనేది చూడకుండా ఎదురుదాడికి దిగాడు. 24 బంతుల్లోనే 258 స్ట్రైక్ రేటుతో 62 పరుగులు (9 ఫోర్లు, 3 సిక్స్ లు) చేశాడు. ఇంకో ఓపెనర్ విఫలమైన తర్వతా వచ్చిన యువ ఆటగాడు అభిషేక్ శర్మ కూడా తనదైన స్టైల్ లో దూకుడుగా ఆడాడు దీంతో పవర్ ప్లే లోనే ఆ జట్టు స్కోరు 80 కి చేరుకుంది
పవర్ ప్లే తర్వాత కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు జోరు కొనసాగించారు. ఈ ఇద్దరూ సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు నమోదు చేసారు , హెడ్ ముందుగా 18 బాల్స్ కి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంటే , ఇండియా ఆటగాడు అభిషేక్ శర్మ 16 బాల్స్ కి హాఫ్ సెంచరీతో రికార్డ్ నెలకొల్పడం విశేషం, శర్మ 23 బంతుల్లో 273 స్ట్రైక్ రేట్ తో 63 పరుగులు ( 7 సిక్స్ లు , 3 ఫోర్లు ) చేసి నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన దక్షిణాఫ్రికా సంచలన ఆటగాడు హెన్రీ క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు కేవలం 34 బంతుల్లో 258 స్ట్రైక్ రేట్ తో 80 పరుగులు ( 7 సిక్స్ లు, 4 ఫోర్లు ) చేసి నాటౌట్ గా నిలిచాడు, మరొక పక్క మరో ఆటగాడు మర్కరమ్ 28 బంతుల్లో 42 రన్స్ చేసి క్లాసెన్ కి సహకారం అందించాడు ప్రతీ ఒక్కరూ హిట్టింగ్ చేయడంతో రన్ రేట్ పదమూడుకి తగ్గకుండా దూసుకెళ్లింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి రికార్డ్ సృష్టించింది
ముంబైయి ఇండియన్స్ బౌలర్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు , బూమ్రా ఒక్కడే కొద్దిగా అంచనాలకు తగ్గ బౌలింగ్ వేసాడు కాని వికెట్లు తీయలేకపోయాడు, పాండ్యా, చావ్లా, గెర్లడ్ ముగ్గురు బౌలర్లు చెరో వికెట్ తీసుకున్నారు
278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబాయి ఇండియన్స్ టీం ఓపెనర్లు రోహిత్ శర్మ , ఇషాన్ కిషాన్ మెరుపు ఆరంభం ఇచ్చారు. కానీ ఛేజింగ్ ఒత్తిడిలో వికెట్లు పారేసుకున్నారు, తర్వాత వచ్చిన తిలక్ వర్మ 34 బంతుల్లో 64 పరుగులు , నామన్ ధీర్ 30 పరుగులతో ముంబాయి విజయంపై ఆశలు రేకెత్తించారు వీళ్లు వెనుదిరిగిన తరువాత ముంబాయి ఓటమి ఖాయంగా కనిపించింది
ముంబాయి కెప్టెన్ పాండ్యా కూడా బ్యాటింగ్ లో నిరాశ పరిచాడు, చివరలో వచ్చిన మరో ఆసీస్ బ్యాటర్ టిమ్ డేవిడ్ 22 బంతుల్లో 42 పరుగులతో కాసేపు మెరుపులు మెరిపించిన విజయాన్ని అందుకోలేకపోయారు. దీంతో ముంబాయ్ ఇండియన్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 రన్స్ మాత్రమే చేసింది, సన్‌రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ఈ సీజన్ లో మొదటి గెలుపును నమోదు చేసుకుంది . సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు జయదేవ్ , కమిన్స్ చెరో రెండు వికెట్లు తీసుకోగా , షబాజ్ అహ్మద్ ఒక వికెట్ తీసుకున్నారు..
జయాపజయాలు పక్కన పెడితే ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన వీక్షకులకు మాత్రం బ్యాటర్ల బౌండరీల మోతతో మంచి వినోదమే లభించిందని చెప్పుకోవచ్చు