ఐపీఎల్ 2024 నేపథ్యంలో శనివారం రాజస్థాన్ లో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది . బెంగళూర్ ఓపెనర్లు విరాట్ కోహ్లీ , డూప్లెసిస్ మొదటి వికెట్ 100 పరుగుల భాగస్వామ్యం చేసి ఆర్సీబీకి సూపర్ ఆరంభాన్ని ఇచ్చారు కింగ్ కోహ్లీ మరోసారి తన అద్బుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ ఈ ఐపీఎల్ సీజన్ లో మొదటి సెంచరీ నమోదు చేసుకున్నాడు . కోహ్లీ 72 బంతుల్లో 113 పరుగులు ( 12 ఫోర్లు , 4 సిక్స్ లు ) లతో అజేయంగా నిలిచాడు , ఫామ్ లేమితో బాధపడుతున్న కెప్టెన్ డూప్లిసిస్ ఈ మ్యాచ్ ద్వారా ఫామ్ లోకి వచ్చినట్టే కనపడ్డాడు , డూప్లిసిస్ 33 బంతుల్లో 44 పరుగులు చేసాడు
రాజస్థాన్ బౌలర్లలలో చాహాల్ 2 వికెట్లు , బర్గర్ 1 వికెట్ తీసుకున్నారు
184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కి ఆదిలోనే జైస్వాల్ వికెట్ కోల్పోయింది కానీ బట్లర్ , సంజు శాంసన్ ఇద్దరూ సెట్ అయ్యి జట్టును గెలుపు వైపు నడిపించారు , ఆర్సీబి పూర్ బౌలింగ్ కి తోడు ఫిల్డింగ్ కూడా సరిగా లేదు , ఏ దశలోనూ రాజస్థాన్ బ్యాటింగ్ ని కట్టడి చేయలేకపోయారు . కెప్టెన్ సంజు శాంసన్ 42 బంతుల్లో 69 పరుగులు ( 2 సిక్స్ లు 8 ఫోర్లు ) కి తోడుగా ఇంగ్లాండ్ బ్యాటర్ 58 బంతుల్లో సెంచరీ ( 9 ఫోర్లు , 4 సిక్స్ లతో ) చేసి రాజస్థాన్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు , రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఈ సీజన్ 4వ గెలుపును సొంతం చేసుకుంది
ఆర్సీబీ బౌలర్లలో టోప్లే తప్ప ఎవరూ పెద్దగా రాణించలేదు టోప్లే 2 వికెట్లు తీసుకోగా డయాల్ , సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా జాస్ బట్లర్ ఎంపిక అయ్యాడు