ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మంగళవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది
వెస్టిండీస్ ఆటగాడు సునీల్ నరైన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 49 బంతుల్లో (13 ఫోర్లు 6 సిక్స్ లు ) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేకేఆర్ తరుపున సెంచరీ బాదిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. రఘువంశీ 30 పరుగులు , రింకు సింగ్ 20 పరుగులు తోడవడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ ముందు ఉంచింది
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ రెండేసి వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
224 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ని ఓపెనర్ జైస్వాల్ మరోసారి నిరాశపరిచాడు, తరువాత వచ్చిన బ్యాటర్లు దూకుడుగా ఆడినా ఎవరూ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. రాజస్థాన్ రాయల్స్ మరో స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ మాత్రం జట్టుని తనదైన శైలిలో గెలుపుకి కృషి చేసాడు , ఒక స్థాయిలో ఓటమి ఖాయం గా కనిపిస్తున్నా పట్టు వీడని విక్రమార్కుడిలా సెంచరీ చేసి రాజస్థాన్ రాయల్స్ కి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు, ఇతర ఆటగాళ్లు రోవ్‌మన్ పోవెల్(13 బంతుల్లో 26) రియాన్ పరాగ్(14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) పరుగులతో సహకారం అందించారు
17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చేజింగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌లను జోస్ బట్లర్ అధిగమించాడు.ఐపీఎల్లో జోస్ బట్లర్‌కు ఇది ఏడో శతకం కాగా.. చేజింగ్‌లో మూడో సెంచరీ. చేజింగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ(2), బెన్ స్టోక్స్(2) ఉన్నారు.
ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక శతకాలు నమోదు చేసిన రెండో బ్యాటర్‌గా జోస్ బట్లర్ నిలిచాడు. ఏడు శతకాలతో అతను కోహ్లీ(8) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్(6)ను బట్లర్ అధిగమించాడు
కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లలో హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ తలో రెండు వికెట్లు తీసారు. వైభవ్ అరోరాకు ఓ వికెట్ దక్కింది. వీరోచిత పోరాటంతో జట్టుని గెలిపించిన జోస్ బట్లర్‌కు ప్లేయర్ అఫ్ ది అవార్డు లభించింది