నేడు ఐపీఎల్ 2024 లో మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. రెండు టీమ్స్ పటిష్టం గానే కనిపిస్తున్నాయి ,. పంజాబ్ కింగ్స్, ఈ సీజన్ లో ఆరు మ్యాచ్ లు ఆడగా కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచి, నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా ఆరు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచి, నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో ఉంది.
పంజాబ్, ముంబై జట్లు మధ్య ఇప్పటి వరకు ఐపీఎల్ లో 31 మ్యాచ్ లు జరగగా, పంజాబ్ కింగ్స్ 15 మ్యాచ్ లు గెలుపొందగా,ముంబై ఇండియన్స్ 16 మ్యాచ్ లలో గెలిచింది. మొహాలిలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం పేసర్లకు ఎక్కువ అనుకూలమైనది . టాస్ ఎవరు గెలిచినా మొదటగా బౌలింగ్ మాత్రమే తీసుకుంటారు