నేడు ఐపీఎల్ లో చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ తో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. అలాగే చెన్నై మాత్రం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ప్లే ఆఫ్ లో కొనసాగాలంటే చెన్నై కూడా ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిన పరిస్థితి.
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ గైక్వాడ్ మంచి ఫామ్ లో ఉండటం ఆ జట్టుకి కలిసి వచ్చే అంశం. గత మ్యాచ్ లో 98 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు , అదే విధంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు మిచెల్ , శివం దూబే కూడా ఫామ్ లో కొనసాగడం నిన్న ప్రకటించిన టీ20 వరల్డ్ కప్ ఇండియా టీంకి శివం దూబ్ ని ఎంపిక చేయడంతో రెట్టించిన ఉత్యాహంతో ఈ మ్యాచ్ కు సన్నద్దం అయ్యాడు
ఇక పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తున్నా బౌలింగ్ విభాగం మాత్రం ఆశించిన రీతిలో ప్రదర్శన ఇవ్వలేకపోతుంది , ఈ మ్యాచ్ లో ఆయినా మంచి ప్రదర్శన కనబరుస్తారేమో చూడాలి . చెన్నై పిచ్ స్పీన్ కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు చేజింగ్ తీసుకునే అవకాశం ఉంది , రెండు జట్లు బలాబలాలు చూస్తే చెన్నై జట్టు ఫేవర్ గా కనిపిస్తుంది