ఈ సీజన్ ముంబయి ఇండియన్స్ కి కలిసి రాలేదు. వరుస ఓటములు , కెప్టెన్సీ మార్చడం వల్లనో ఏమో తెలియదు కానీ గెలిచే జట్టు మీద కూడా గెలవలేని పరిస్థితి.. ముంబయి ఇండియస్స్ ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టు ఇలాంటి పేలవ ఆట ప్రదర్ళిస్తుంది అంటే క్రికెట్ లవర్స్ కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బ్యాటర్లు ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోతున్నారు. అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు, బౌలింగ్ ప్రదర్శన కూడా అంతే, వరస వైఫల్యాలు ఆ జట్టును పాయింట్ల పట్టికలో మరింత దిగజారుస్తున్నాయి.
ముంబాయి ఇక ఇంటికే
ఐపీఎల్ 2024లో భాగంగా.. నిన్న ముంబయి ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మరోసారి ముంబయికి ఓటమి ఎదురయింది. వరసగా మూడో సారి ఓటమి పాలైంది. ఇక ప్లే ఆఫ్ కూడా చేరుకోవడం కూడా కష్టంగానే మారింది. ముంబయి జట్టుపై లక్నో సూపర్ జెయింట్స్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టులో ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. రోహిత్ శర్మ, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా ఇలా వరస బెట్టి అవుటయ్యారు. ముంబయి జట్టులో వధేరా 46 పరుగులు, టిమ్ డేవిడ్ 35 పరుగులు చేసి జట్టు పరువు కాపాడారు. సూర్యకుమార్ యాదవ్ కూడా విఫలం కావడంతో ఆ జట్టు 144 స్కోరుకే అవుట్ అయింది.
తర్వాత లక్ష్య సాధనలో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ స్వల్ప స్కోరు మాత్రమే కావడంతో పెద్దగా శ్రమించలేదు. కెప్టెన్ కెఎల్ రాహుల్ 28 పరుగుల చేసి అవుటయ్యాడు. దీపక్ హుడా 18 పరుగులు , పూరన్ 14 పరుగులు చేశారు స్టొయినిస్ నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును పెంచుతూ 62 పరుగులు చేశాడు. దీంతో ముంబయి ఇండియన్స్ పై లక్నో జట్టు నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది.
మార్కస్ స్టోయినిస్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది