ఐపీఎల్ – 2024 నేపథ్యంలో ఏప్రిల్ 7వ తేదీన వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ముంబాయి ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ , బౌలింగ్ లో పేలవ ప్రదర్శన కనబరిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (49), ఇషాన్ కిషన్ (42), టిమ్ డేవిడ్ (45), షెఫర్డ్ (39) బ్యాటింగ్ విజృంభణతో ముంబై అంత భారీ స్కోరు చేయగలిగింది.
లక్ష్య ఛేధనలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడినా కూడా ఫలితం లేకుండా పోయింది పృథ్వీ షా (66), అభిషేక్ (41), స్టబ్స్ (71) అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడిన లక్ష్యం భారీగా ఉండటంతో ఓటమి తప్పలేదు . స్టబ్స్ మైదానంలో పెను విధ్వంసమే సృష్టించాడు. కానీ.. ఇతర బ్యాటర్ల నుంచి తగిన సహకారం అందకపోవడంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో8 వికెట్స్ కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ముంబాయి ఇండియన్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పై సాధించిన విజయంతో.. . టీ20 క్రికెట్ చరిత్రలో (ఐపీఎల్, సీఎల్టీ20 తో కలిపి) 150 విజయాలు సాధించిన మొట్టమొదటి జట్టుగా సంచలన రికార్డ్‌ని సృష్టించింది.ముంబై తర్వాత 148 విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో ఉంది. అంటే.. ఈ టోర్నమెంట్‌లోనే ఆ జట్టు కూడా 150 విజయాల మైలురాయిని అందుకోనుంది.