ఐపీఎల్ 2024 సీజన్ 21వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ గుజరాత్ టైటాన్స్‌పై 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
మార్కస్ స్టొయినిస్ అర్ధ సెంచరీ చేసాడు , కేఎల్ రాహు 33 పరుగులు చేయగా, నికోలస్ పూరన్ 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆయుష్ బడోని 11 బంతుల్లో 20 పరుగులు చేశాడు.ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే రెండేసి వికెట్లు తీశారు. రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.
163 పరుగులు లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆదిలోనే తడబడింది. లక్నో బౌలర్ల కట్టుదిట్ట బౌలింగ్ కు 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటై 33 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. యశ్ ఠాకూర్ 5 వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బ తీశాడు. స్పిన్నర్ కృనాల్ పాండ్యా 3 వికెట్లు తీయగా, రవి బిష్నోయ్ ఒక వికెట్ తీశాడు.
గుజరాత్‌కు శుభమాన్ గిల్, సాయి సుదర్శన్ 6 ఓవర్లలో 54 పరుగుల భాగస్వామ్యతో శుభారంభం అందించినప్పటికీ వాళ్లిద్దరూ అవుట్ అయ్యాక మిగిలిన బ్యాటర్లు ఎవరు రాణించలేకపోయారు, కృనాల్ పాండ్యా సాయి సుదర్శన్‌ను (31 పరుగులు) ఔట్ చేయడంతో వికెట్ల పరంపర మొదలైంది. శుభమన్ గిల్ 19, కేన్ విలియమ్సన్ 1, శరత్ బీఆర్ 2, విజయ్ శంకర్ 17, దర్శన్ నల్కండే 12, రషీద్ ఖాన్ 0 పరుగులకు పెవిలియన్ చేరారు. యశ్ ఠాకూర్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది