ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్‌పై కోల్ కత్తా నైట్ రైడర్స్ 24 పరుగులతో విజయం సాధించింది, కేకేఆర్ 12 ఏళ్ల తరువాత ముంబాయి సొంత గడ్డపై ఈ విజయం సాధించింది . ముంబాయి ఇండియన్స్ మొదటగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది , తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కత్తా నైట్ రైడర్స్ ఆదిలోనే వికెట్లు కోల్పోయారు , పవర్ ప్లేలో కేవలం 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది.
ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన మనీశ్ పాండే తో కలిసి మరో బ్యాటర్ వెంకటేశ్ అయ్యార్ కోల్ కత్తా ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు, ఇద్దరూ 6 వికెట్ కు 70 పరుగుల భాగస్వామ్యంతో మంచి స్కోర్ ను రాబట్టారు, వెంకటేశ్ అయ్యార్ 52 బంతుల్లో 70 పరుగులు, మనీష్ పాండే 31 బంతుల్లో 42 పరుగులు చేయడంతో కోల్ కత్తా నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబాయి ఇండియన్స్ బ్యాటర్లు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయారు , కోల్ కత్తా బౌలర్ల దాటికి ముంబాయి ఇండియన్స్ 145 పరుగులకే ఆలౌట్ అయ్యి ఓటమి మూటగట్టుకుంది , ముంబాయి బ్యాటర్ లలో సూర్య కుమార్ ఒక్కడే 56 పరుగులతో రాణించాడు.
కోల్ కత్తా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు , వరుణ్ చక్రవర్తి 2, సునీల్ నరైన్ 2 , ఆండ్రూ రస్సెల్ 2 వికెట్లు తీసుకున్నారు, వెంకటేశ్ అయ్యార్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది, ఈ ఓటమితో ముంబాయి ఇండియన్స్ ఐపీఎల్ ఈ సీజన్ నుంచి దాదాపు నిష్క్రమించినట్టే.