ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మరో విజయాన్ని సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది . ఈ ఓటమితో ఢిల్లీ జట్టు రెండో స్థానానికి చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. ఆ జట్టు ప్రస్తుతం 11 మ్యాచుల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది, కోల్ కత్తా ఈ విజయంతో రెండో స్థానాన్ని పదిలం చేసుకుంది
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. కేకేఆర్ బౌలర్ల ధాటికి 153/9 పరుగులకు పరిమితమైంది. ఏ దశలోను బ్యాటర్లు రాణించలేకపోయారు. బౌలర్ కుల్దీప్ యాదవ్ 31 పరుగులు ఆ జట్టు బ్యాటర్ అత్యదిక స్కోర్ కావడం వాళ్ల బ్యాటింగ్ వైఫల్యానికి అద్దం పడుతుంది.
154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్‌లు మంచి ఆరంభం ఇచ్చారు. ఎడాపెడా సిక్స్‌లు, ఫోర్లు కొట్టడంతో ఆ జట్టు పవర్ ప్లే ముగిసే సరికి వికెట్లు కోల్పోకుండా 79 పరుగులు చేయడంతో ఆ జట్టు విజయాన్ని ఖారారు చేసుకున్నట్టే కనిపించింది . ఫిలిప్ సాల్ట్ 33 బంతుల్లో 68 పరుగులు చేశాడు. సునీల్ నరైన్ (15), శ్రేయస్ అయ్యర్ 23 బంతుల్లో 33 రన్స్ , వెంకటేశ్ అయ్యర్ 23 బంతుల్లో 26 రన్స్, చేసారు దీంతో కేకేఆర్ 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ ను కట్టు దిట్ట బౌలింగ్ తో కట్టడి చేసి మూడు వికెట్లు తీసుకున్న వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది