నేడు ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ , ఢిల్లీ కాపిటల్స్ జట్ల మధ్య మరో కీలక మ్యాచ్ జరగనుంది విశాఖ వేదికగా డాక్టర్ వైఎస్సాఆర్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది
ఢిల్లీ కాపిటల్స్ వరస ఓటముల తరువాత గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించి ఆత్మవిశ్వసం మూటగట్టుకుంది, ఈరోజు మళ్ళీ అదే వేదికగా మ్యాచ్ జరగనుండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం, కెప్టెన్ పంత్ కూడా ఫామ్ లోకి రావడం ఓపెనర్స్ ఇద్దరు మంచి ఆరంభాన్ని ఇవ్వడం కూడా ఢిల్లీకి శుభ పరిణామం
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కూడా ఆడిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది, ఈ మ్యాచ్ లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటుంది., రెండు జట్లు బలాబలాలు చూస్తే కోల్కతా నైట్ రైడర్స్ బలంగా కనిపిస్తుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు తలపడిన మ్యాచ్ లు చూస్తే 15 సార్లు ఢిల్లీ గెలవగా , 16 సార్లు కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది, పిచ్ కండిషన్ బట్టి టాస్ ఎవరు గెలిచిన మొదటగా బౌలింగ్ తీసుకుంటారు